ఆడబిడ్డ పెళ్లికి సర్పంచ్ కానుకగా ₹5016 అందజేత
Views: 4
On
వేలేరు, మార్చ్ 05 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలంలోని పీచర గ్రామానికి చెందిన మరిజే రజిత–లక్ష్మణ్ రావు దంపతుల కనిష్ట కుమార్తె వైష్ణవి వివాహం నరేష్‌తో పీచర గ్రామంలో ఘనంగా జరిగింది. వారి ఆహ్వానం మేరకు గ్రామ సర్పంచ్ మరిజే అనిత నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను నిండు మనసుతో ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డ పెళ్లి సందర్భంగా సర్పంచ్‌గా ₹5016 నగదును పెళ్లి కానుకగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో డీలర్ మోరే జైపాల్, కదుగయ చందర్ రావు, మరిజే మోహన్ రావు, గుడికందుల రమేష్, బాపురావు, మనోహర్, రమేష్, అశోక్, ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 Mar 2026 17:22:52
వేలేరు, మార్చ్ 05 (తెలంగాణ ముచ్చట్లు):వేలేరు మండలంలోని పీచర గ్రామానికి చెందిన మరిజే రజిత–లక్ష్మణ్ రావు దంపతుల కనిష్ట కుమార్తె వైష్ణవి వివాహం నరేష్‌తో పీచర గ్రామంలో...


Comments