కీసరలో చోరీ కలకలం తులం బంగారం, రూ.20 వేల నగదు అపహరణ

కీసరలో చోరీ కలకలం తులం బంగారం, రూ.20 వేల నగదు అపహరణ

కీసర, మార్చ్ 01 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర లో చోరీ ఘటన కలకలం రేపింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కీసర డివిజన్–1, శ్రీనివాస్ నగర్ కాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
కాలనీలో నివసిస్తున్న లావణ్య భర్త విష్ణు కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఇంటి తలుపుల తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు సుమారు ఒక తులం బంగారం, రూ.20 వేల నగదును అపహరించినట్లు బాధితులు తెలిపారు.ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి వెంటనే డయల్ 100కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను సేకరిస్తూ నిందితుల కోసం గాలిస్తున్నారు.ఈ ఘటనతో కాలనీ వాసుల్లో ఆందోళన నెలకొంది. పోలీసులు రాత్రి పూట గస్తీ పెంచి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .