మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మున్సిపల్ పదవుల ఎన్నికలు పూర్తి

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మున్సిపల్ పదవుల ఎన్నికలు పూర్తి

_మూడుచింతలపల్లి, ఆలియాబాద్, ఎల్లంపేట్ మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్‌లు, వైస్ చైర్‌పర్సన్‌లు ఎన్నిక

ప్రత్యేక అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం

మేడ్చల్–మల్కాజిగిరి , ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మున్సిపాలిటి లు, మున్సిపల్ కార్పొరేషన్‌ల సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా సోమవారం జిల్లాలోని మూడుచింతలపల్లి, ఆలియాబాద్, ఎల్లంపేట్ మున్సిపాలిటీలలో చైర్‌పర్సన్‌లు, వైస్ చైర్‌పర్సన్‌ల ఎన్నిక ప్రక్రియ శాంతియుతంగా నిర్వహించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు.*ఆలియాబాద్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా కంటం శిరీష అలియాస్ కంటం శ్వేత (కాంగ్రెస్) ఎన్నిక కాగా, వైస్ చైర్‌పర్సన్‌గా కన్రెడ్డి మాలతి (బీజేపీ) ఎన్నికయ్యారు. వీరితో ప్రత్యేక అధికారి, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి హరిష్ బాబు ప్రమాణ స్వీకారం చేయించారు.*మూడుచింతలపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా జామురవి (బీఆర్ఎస్), వైస్ చైర్‌పర్సన్‌గా మొరుగుబాయి శశిరేఖ (బీఆర్ఎస్) ఎన్నికయ్యారు. వీరితో ప్రత్యేక అధికారి, జిల్లా కోఆపరేటివ్ అధికారి నాగలింగ చారి ప్రమాణ స్వీకారం చేయించారు.*ఎల్లంపేట్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా లావుడ్య శ్రీదేవి (బీఆర్ఎస్) ఎన్నిక కాగా, వైస్ చైర్‌పర్సన్‌గా మేకల రజిత (బీజేపీ) ఎన్నికయ్యారు. వీరితో ప్రత్యేక అధికారి, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పట్టణాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు అధికారులు వెల్లడించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .