మహాశివరాత్రి సందర్భంగా శివ సాయి దేవాలయంలో ప్రత్యేక పూజలు

మహాశివరాత్రి సందర్భంగా శివ సాయి దేవాలయంలో ప్రత్యేక పూజలు

కుషాయిగూడ, ఫిబ్రవరి 15 (తెలంగాణ ముచ్చట్లు): 

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొ ని కుషాయిగూడ డివిజన్ పరిధిలోని శివ సాయి నగర్‌లో ఉన్న శివ సాయి దేవాలయం లో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. తెల్లవారు జాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, ఆర్చనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ సాయిలు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ బర్ల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కమిటీ సభ్యులు కొండగళ్ల అశోక్, కాసుల రమేష్ రావు, షాబాద్ దామోదర్ రెడ్డి, శ్రీరాములు, చక్రపాణి, బాణాల రామకృష్ణారెడ్డి, కృష్ణ, శ్రీనివాస గాంధీ, రాజు గౌడ్, కృష్ణారెడ్డి, రాజిరెడ్డి, సరికొండ రమేష్, శివలింగం, సత్యనారాయణ రెడ్డి, జూపల్లి అశోక్, కందుల సత్యనారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేసి కార్యక్రమం శాంతియుతంగా ముగిసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

సాహిత్య సంగ్రామంలో కట్టెకోలకు సత్కారం సాహిత్య సంగ్రామంలో కట్టెకోలకు సత్కారం
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 15(తెలంగాణ ముచ్చట్లు) రామదాసు సాహితీ కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాదులోని కూకట్ పల్లిలో నిర్వహించిన సాహిత్య సంగ్రామంలో ఖమ్మం నగరానికి చెందిన...
మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో భక్తుల రద్దీ 
కాప్రా లో శివ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహణ
మహాశివరాత్రి సందర్భంగా శివ సాయి దేవాలయంలో ప్రత్యేక పూజలు
సోక్రటీస్ వర్ధంతి – గెలీలియో జయంతి సందర్భంగా సంస్మరణ సభ
నేరేడ శివయ్య సన్నిధిలో  డిప్యూటీ సీఎం భట్టి దంపతుల ప్రత్యేక పూజలు..
మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు