పురపోరులో ‘పొంగులేటి’ మ్యాజిక్

పురపోరులో ‘పొంగులేటి’ మ్యాజిక్

- *10 రోజుల్లో.. 249 వార్డుల్లో ప్రచారం* 

- *70 శాతం సక్సెస్ రేటుతో 174 వార్డుల్లో గెలుపు*

- *శీనన్న వ్యూహంతో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ పురపాలికల్లో హస్తం ప్రభంజనం!*
 

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 14(తెలంగాణ ముచ్చట్లు)

మున్సిపల్ ఎన్నికల కురుక్షేత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (శీనన్న) ఒక అజేయ శక్తిగా నిలిచారు. ముఖ్యమంత్రి రేవంతన్న అప్పగించిన బాధ్యతను సవాలుగా తీసుకున్న ఆయన, తన వ్యూహ చతురతతో ఫలితాలను తలకిందులు చేశారు. కేవలం అంకెలే కాదు.. ఆ అంకెల వెనుక ఉన్న ఆయన కష్టం, ప్రచారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం 10 రోజుల్లోనే అసాధ్యమనుకున్న సమీకరణాలను సుసాధ్యం చేసి చూపారు.

*ఉమ్మడి ఖమ్మం జిల్లా : శీనన్న అడ్డాలో తిరుగులేని హవా!*
తన సొంత గడ్డపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాలివాటం కాదు.. సునామీ సృష్టించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆయన అడుగుపెట్టిన ప్రతిచోటా కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది.

ఏదులాపురం : 32 వార్డుల్లో ఏకంగా 24 చోట్ల జయకేతనం ఎగురవేసి సత్తా చాటారు.

కొత్తగూడెం కార్పొరేషన్ : సింగరేణి హృదయంలో 22 స్థానాలను కైవసం చేసుకున్నారు.

కల్లూరు & సత్తుపల్లి: కల్లూరులో 12, సత్తుపల్లిలో 17 వార్డులను హస్తం ఖాతాలో వేశారు.
 
ఇల్లందు&అశ్వారావుపేట : ఇక్కడ కూడా ఇల్లందులో 19, అశ్వారావుపేటలో 17 స్థానాల్లో గెలిచి తన పట్టును నిరూపించుకున్నారు.

*ఓరుగల్లు కోటపై హస్తం జైత్రయాత్ర!*
రేవంతన్న ఆశీస్సులతో ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యతలను స్వీకరించిన శీనన్న, అక్కడ కూడా ప్రత్యర్థుల కోటలను బద్ధలు కొట్టారు.

భూపాలపల్లి : అత్యంత కీలకమైన ఈ మున్సిపాలిటీలో 16 వార్డులను గెలుచుకుని పట్టు సాధించారు.

పరకాల & స్టేషన్ ఘన్‌పూర్ : పరకాలలో 13, స్టేషన్ ఘన్‌పూర్‌లో 13 స్థానాలను గెలిపించి జిల్లాలో కాంగ్రెస్ ప్రాభవాన్ని చాటారు.

*గణాంకాలే సాక్ష్యం : 249 వార్డుల ప్రచారం.. 174 స్థానాల్లో విజయం!*
మొత్తంగా మంత్రి పొంగులేటి ప్రచారం నిర్వహించిన 249 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 174 స్థానాలను గెలుచుకుంది. అంటే సుమారు 70 శాతం గెలుపు రేటుతో ఆయన 'మోస్ట్ సక్సెస్‌ఫుల్' లీడర్‌గా నిలిచారు. పగలు రేయి ఏకంచేసి ఆయన సాగించిన సుడిగాలి పర్యటనలు, రేవంతన్న సంక్షేమ పథకాలపై ప్రజలకు కల్పించిన భరోసా ఓట్ల వర్షంగా కురిసింది. మాట ఇస్తే తప్పని నైజంతో, అభివృద్ధిపై ఉన్న నిబద్ధతతో శీనన్న ప్రజాప్రభుత్వంలో తన మార్క్ రాజకీయాలను మరోసారి చాటిచెప్పారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ
వనపర్తి,ఫిబ్రవరి14(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా భక్తులు ఉపవాసం, జాగరణ, శివనామస్మరణతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.జిల్లాలో సాంస్కృతిక,...
విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్‌లో ఘనంగా వార్షిక క్రీడా దినోత్సవం
మల్లికుదుర్లలో గట్టుమల్లికార్జున స్వామి దేవస్థానం నూతన పాలక వర్గ  కమిటీ ఎన్నిక
అమరవీరుల కుటుంబాలకు దేశం ఎప్పటికి ఋణం పడి ఉంటుంది  
కేటీఆర్, హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన పాండాల శివకుమార్ గౌడ్
చిన్న పత్రికలపై చిన్న చూపు తగదు
వనపర్తి మునిసిపాలిటీలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు