వల్భాపుర్ గ్రామ పంచాయతీ నూతన భవనానికి భూమి పూజ

గ్రామ అభివృద్ధే లక్ష్యం: సర్పంచ్ శ్వేత శ్రీనివాస్

వల్భాపుర్ గ్రామ పంచాయతీ నూతన భవనానికి భూమి పూజ

ఎల్కతుర్తి, ఫిబ్రవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ శ్వేత శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం శుభప్రదంగా, ఘనంగా నిర్వహించారు.
వేద మంత్రోచ్చారణల మధ్య భూమి పూజ కార్యక్రమం నిర్వహించగా, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్వేత శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలన, పారదర్శక సేవలు అందించేందుకు సౌకర్యవంతమైన, ఆధునిక సదుపాయాలతో కూడిన పంచాయతీ భవనాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు.
గ్రామ అభివృద్ధే తమ ప్రధాన ధ్యేయమని, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులను సమర్థవంతంగా వినియోగించి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
ఉప సర్పంచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని, అందరూ కలిసికట్టుగా ముందుకు వస్తే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రేణుక, కుమార్, శ్రీను, రాధ, కిషోర్, అరుణ, సునీత, నాగరాజు, ముక్క లావణ్య, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె – వనపర్తిలో భారీ నిరసన ర్యాలీ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె – వనపర్తిలో భారీ నిరసన ర్యాలీ
వనపర్తి,ఫిబ్రవరి12(తెలంగాణ ముచ్చట్లు): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సమ్మెకు మద్దతుగా వనపర్తి జిల్లా కేంద్రంలో కార్మిక...
కల్లూరు మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు.
రాధిక చౌరస్తాలో ఆటో కార్మికుల భారీ నిరసన
హరిత ఎంక్లేవ్‌లో మురుగునీటి సమస్యపై స్వర్ణరాజ్ శివమణి పర్యటన
హరిత ఎంక్లేవ్‌లో మురుగునీటి సమస్యపై స్వర్ణరాజ్ శివమణి పర్యటన
బండారి రాజిరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
ఓటమి భయంతో గిఫ్టుల వసూలు?