గోపాల్‌పూర్‌ ఆదర్శ పురుషుల పొదుపు సంఘం నుంచి ఆర్థిక భరోసా

గోపాల్‌పూర్‌ ఆదర్శ పురుషుల పొదుపు సంఘం నుంచి ఆర్థిక భరోసా

ఎల్కతుర్తి. ఫిబ్రవరి 10( తెలంగాణ ముచ్చట్లు):

గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన ఆదర్శ పురుషుల పొదుపు సంఘంలో రెగ్యులర్ మెంబర్‌గా కొనసాగుతూ ప్రమాదవశాత్తు మృతి చెందిన గండికోట లక్ష్మణ్ గారి నామిని కి సంఘం తరఫున రూ.2,00,000 (రెండు లక్షల రూపాయలు) ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు రాజిరెడ్డి , సంఘ అధ్యక్షులు తాటికొండ అభిలాష్  చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో సమితి గణకులు పున్నం చందర్ , సంఘ పాలకవర్గ సభ్యులు మరియు సంఘ గణకులు పాల్గొన్నారు.
సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా ఆదర్శ పురుషుల పొదుపు సంఘం పనిచేస్తోందని, ఇలాంటి కష్టకాలంలో సభ్యుల కుటుంబాలకు అండగా నిలవడం సంఘ బాధ్యత అని నాయకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాలు సామాజిక భద్రతకు దోహదపడుతున్నాయని వారు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .