మోజర్ల గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

మోజర్ల సర్పంచ్ కె. చంద్రశేఖర్

మోజర్ల గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

పెద్దమందడి,ఫిబ్రవరి11(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి గ్రామసభ విజయవంతంగా ముగిసింది.గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై సభలో విస్తృతంగా చర్చించి, గ్రామస్తుల ఏకగ్రీవ ఆమోదంతో తీర్మానాలు చేయడం జరిగింది.గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పలు డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టాలని నిర్ణయించారు.ఇందులో భాగంగా కానాయపల్లి విష్ణు ఇంటి నుండి సాకలి శంకరమ్మ ఇంటి వరకు అండర్ డ్రైనేజీ నిర్మాణం, పోతుల రాములు ఇంటి నుండి విఐపి సమస్త పొలం వరకు డ్రైనేజీ నిర్మాణం, కానాయపల్లి లక్ష్మయ్య ఇంటి వెనుక నుండి నాగులకుంట వరకు డ్రైనేజీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు.అలాగే ముదిరాజు బిల్డింగ్ నుంచి మార్చ శాంతన్న ట్రాన్స్‌ఫార్మర్ వరకు, వాల్దాస్ నరేష్ గౌడ్ ఇంటి నుంచి జంగిడి నాగాలక్ష్మి ఇంటి వెనుక వరకు, బాండెడ్ లేబర్ కాలనీలో భూపని మన్యం ఇంటి నుండి ఎర్ర కాలువ వరకు అండర్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.గ్రామంలోని అన్ని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ భద్రతార్థం ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కూడా గ్రామసభలో నిర్ణయం తీసుకున్నారు.గ్రామాభివృద్ధి దిశగా తీసుకున్న ఈ తీర్మానాలకు సహకరించిన గ్రామ ప్రజలకు సర్పంచ్ కె. చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో మోజర్లను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .