కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం

కీసర, ఫిబ్రవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):

మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భవాని శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ తటాకం వెంకటేష్ శర్మ, కార్యనిర్వాహణాధికారి కట్ట సుధాకర్‌రెడ్డి కలిసి ముఖ్యమంత్రికి అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు.బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ అధికారులు సీఎంకు వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .