నాచారం–హెచ్ఎంటి నగర్ అభివృద్ధికి రూ.4.66 కోట్ల పనులకు శంకుస్థాపన

నాచారం–హెచ్ఎంటి నగర్ అభివృద్ధికి రూ.4.66 కోట్ల పనులకు శంకుస్థాపన

నాచారం, ఫిబ్రవరి 09 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్‌లో రూ.4 కోట్ల 66 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నాచారం డివిజన్‌తో పాటు హెచ్ఎంటి నగర్ డివిజన్‌ను కూడా సమానంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా హెచ్ఎంటి నగర్‌లో రూ.70 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం హెచ్ఎంటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా పెద్ద చెరువును రూ.30 కోట్ల రూపాయలతో సుందరీకరించనున్నట్లు ఆయన ప్రకటించారు.పెద్ద చెరువు సుందరీకరణతో నాచారం ప్రాంతంలో దోమల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.IMG-20260209-WA0110ఈ కార్యక్రమంలో ఏఈ సూరజ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్, నాచారం పరిధిలోని వివిధ కాలనీల సంక్షేమ సంఘాల నాయకులు, బారాస నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .