నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

కీసర, ఫిబ్రవరి 9(తెలంగాణ ముచ్చట్లు):

వేసవి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా యాదగిరి పల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ ఫీడర్లలో నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో కీసర మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు కీసర విద్యుత్ శాఖ ఏఈ ఎస్. మురళి కృష్ణ తెలిపారు.యాదగిరి పల్లి సబ్‌స్టేషన్ నుండి 11 కేవీ చెర్యాల ఫీడర్ పరిధిలో ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. ఈ సమయంలో చెర్యాల గ్రామం, టిపిఎస్ పుష్ప నగర్, లాంగ్ సర్వీసెస్, ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ ఎన్‌క్లేవ్, బాలాజీ ఎన్‌క్లేవ్, ఎంఎల్‌ఆర్ కాలనీ, గణేష్ టౌన్‌షిప్, ఎన్ఎస్ఆర్ బృందావన్, గాంధీ బొమ్మ, రామారావు ఏజీఎల్, సాయి కాలనీ, సాయి నగర్, సుప్రభాత కళాశాల, ఎస్‌ఎల్ గ్రూప్ చెర్యాల, ఈడెన్ గార్డెన్స్ మరియు కుందన్‌పల్లి చౌరస్తా ప్రాంతాలు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు .అదేవిధంగా యాదగిరి పల్లి సబ్‌స్టేషన్ నుండి 11 కేవీ నర్సంపల్లి ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 02:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని తెలిపారు. ఈ సమయంలో నర్సంపల్లి గ్రామం, డిఆర్‌డిఓ ఎదురుగా, కుండెళ్ల ఫారం, పైప్స్ కంపెనీ, ముత్యం గౌడ్ ఫారం, లెదర్ ఫ్యాక్టరీ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.విద్యుత్ వినియోగదారులు ముందస్తుగా అవసరమైన జాగ్రత్తలు తీసుకొని శాఖకు సహకరించాలని కీసర విద్యుత్ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .