కూతురు పుట్టినరోజున సేవా భావం చాటిన ట్రాఫిక్ కానిస్టేబుల్
అంబేద్కర్ నగర్ అంగన్వాడికి స్టేషనరీ, 20 కుర్చీల విరాళం
Views: 44
On
నాచారం, ఫిబ్రవరి 09 (తెలంగాణ ముచ్చట్లు):
ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తన కూతురు అర్నిక టెండూల్ పుట్టినరోజు సందర్భంగా మానవీయతకు నిదర్శనంగా నిలిచారు. ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ అంగన్వాడి కేంద్రంలో చిన్నారులతో కలిసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రంలో చదువుకుంటున్న పిల్లలకు అవసరమైన స్టేషనరీ వస్తువులను పంపిణీ చేయడంతో పాటు అంగన్వాడి అవసరాల కోసం 20 కుర్చీలను కానిస్టేబుల్ దంపతులు అందజేశారు. చిన్నారులతో కలిసి తమ కూతురు పుట్టినరోజును జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వారు తెలిపారు.సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చే ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టాలని కానిస్టేబుల్ దంపతులు పిలుపునిచ్చారు. వారి సేవా భావాన్ని స్థానికులు, అంగన్వాడి సిబ్బంది అభినందించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments