నవోదయనగర్ బస్తీ కమాన్ నిర్మాణానికి రూ.10 వేల విరాళం
బస్తీ అభివృద్ధికి సహకారం అందించిన వంజరి ప్రవీణ్ కరిపే
నాచారం, జనవరి 28 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని నవోదయనగర్ బస్తీలో నిర్మించనున్న కమాన్ పనుల కోసం బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు వంజరి ప్రవీణ్ కరిపే రూ.10,000/- (పది వేల రూపాయలు) నగదు విరాళంగా అందజేశారు. బస్తీ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఈ సహాయాన్ని అందించడం జరిగింది.ఈ సందర్భంగా బస్తీ నాయకుల సమక్షంలో బస్తీ అధ్యక్షులు సింగపాక లింగంకు విరాళాన్ని అధికారికంగా అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, బస్తీకి గుర్తింపుగా నిలిచే కమాన్ నిర్మాణం పూర్తయితే స్థానికులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, బస్తీ సౌందర్యం మరింత పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కొయ్యాడ జైపాల్, ఇంద్రాల సత్యనారాయణ, ముక్క శ్రీనివాస్ తదితరులు పాల్గొని కమాన్ నిర్మాణానికి తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. బస్తీ అభివృద్ధికి ఎప్పుడూ ముందుంటున్న వంజరి ప్రవీణ్ కరిపే సేవలను వారు ప్రశంసించారు.బస్తీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని వంజరి ప్రవీణ్ కరిపే ఈ సందర్భంగా తెలిపారు.


Comments