సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో నమూనా ఈఏపీసెట్–2026కు విశేష స్పందన.
బి గంగారంలో ఎం.పి.సి విద్యార్థులకు ప్రతిభా పరీక్ష నిర్వహణ.
సత్తుపల్లి, జనవరి 28 (తెలంగాణ ముచ్చట్లు):
మండల పరిధిలోని బి గంగారం సాయిస్ఫూర్తి స్వయంప్రతిపత్తి ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయిలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలల ఎం.పి.సి విద్యార్థినీ, విద్యార్థుల కోసం సాయిస్ఫూర్తి స్వయంప్రతిపత్తి ఇంజనీరింగ్ కళాశాలలో నమూనా ఈఏపీసెట్–2026 ప్రవేశ పరీక్షను నిర్వహించారు.
సాయిస్ఫూర్తి స్వయంప్రతిపత్తి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు మరియు సిబ్బంది వ్యయప్రయాసలతో నేటి విద్యార్థినీ, విద్యార్థులకు సాంకేతిక విద్యపై అవగాహన కల్పించాలనే పట్టుదలతో ఈ నమూనా ఈఏపీసెట్–2026 ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను బహుళ ఐచ్ఛిక విధానంలో నిర్వహించారు.
ఈ పరీక్ష విధానం ప్రకారం గణితం – 80 ప్రశ్నలు, 80 మార్కులు, రసాయనశాస్త్రం – 40 ప్రశ్నలు, 40 మార్కులు, భౌతికశాస్త్రం – 40 ప్రశ్నలు, 40 మార్కులు, మొత్తం 160 ప్రశ్నలు, 160 మార్కులు, 180 నిమిషాల వ్యవధిలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడినట్లు కళాశాల నమూనా ఈఏపీసెట్–2026 ప్రవేశ పరీక్ష కన్వీనర్ మరియు కళాశాల ఈఈఈ విభాగాధిపతి కోట రామకృష్ణప్రసాద్ వివరించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ ఇటువంటి పరీక్షల ద్వారా విద్యార్థినీ, విద్యార్థులు తమ నైపుణ్యాలను పరీక్షించుకోవడంతో పాటు పరీక్షల పట్ల ఉండే భయం, బిడియం వంటి భావాలను దూరం చేసుకోవచ్చని తెలిపారు. విద్యలో పరీక్షలు విజయానికి ఒక సోపానమని, శాయశక్తులా కృషి చేస్తే ఆ కృషే అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని అన్నారు. విద్యపై దృష్టి కేంద్రీకరించి సానుకూలంగా, ప్రశాంతంగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ఆత్మవిశ్వాసంతో ఉండాలని సూచించారు. విద్యార్థినీ, విద్యార్థులు పట్టుదలతో చదివి అత్యధిక మార్కులు సాధించి ఉత్తమ ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి సెల్ నంబరు 9963084558, కళాశాల ప్రవేశాల ఇన్‌చార్జి కోట రామకృష్ణప్రసాద్ మొబైల్ నంబరు 9642621363లను సంప్రదించవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి మరియు ప్రతినిధి దాసరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పరీక్షకు హాజరైన విద్యార్థినీ, విద్యార్థులకు ఇంటర్మీడియట్ అనంతరం ఉన్నత కోర్సులకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించారు. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఏ విభాగంలో చదువు కొనసాగించాలన్న ఆలోచన విద్యార్థుల్లో మొదలవుతుందని తెలిపారు. ఇంటర్మీడియట్ కోర్సుల ద్వారానే ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుందని వివరించారు. చిన్న వయసులోనే ఉద్యోగంలో స్థిరపడాలనుకునే వారు, ఇంజనీరింగ్ నిపుణులుగా ఎదగాలనుకునే విద్యార్థులకు ఇంటర్మీడియట్ కోర్సులు మంచి వేదికగా నిలుస్తున్నాయని చెప్పారు.
ప్రస్తుతం ఇంజనీరింగ్‌లో పట్టభద్రులైన అనేక మంది ఎఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో సాఫ్ట్‌వేర్ రంగంలో మంచి వేతనాలతో జీవితంలో స్థిరపడుతున్నారని తెలిపారు. చదువుకు తగ్గ ఉద్యోగాలు సాధించి చాలామంది విదేశాల వైపు ప్రయాణం సాగిస్తున్నారని అన్నారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యాలు పెంపొందించుకొని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముందుంటున్నారని చెప్పారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఈఏపీసెట్–2026లో సాధించిన ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్ విధానంలో నేరుగా ఇంజనీరింగ్ బీటెక్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యాధికులు, హెటిరో ఫార్మాస్యూటికల్ కంపెనీ అధినేత, రాజ్యసభ సభ్యుడు మరియు సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి, విపాసన విద్యా ట్రస్టీ బండి అన్విద వర్చువల్ విధానం ద్వారా విద్యార్థినీ, విద్యార్థులకు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి మరియు ప్రతినిధి దాసరి ప్రభాకర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి, కళాశాలలోని అన్ని ఇంజనీరింగ్ విభాగాల అధ్యాపకులు, సిబ్బంది మరియు ఇంటర్మీడియట్ విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ రోజు కళాశాలలో నిర్వహించిన నమూనా ఈఏపీసెట్–2026 పరీక్షను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి పర్యవేక్షించారు.


Comments