పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు

పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు

పెద్దమందడి,జనవరి16(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై జలంధర్ రెడ్డిని వెల్టూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ సర్పంచ్ అభ్యర్థి వడ్డే శేఖర్ ఆధ్వర్యంలో నాయకులు ఎస్సై జలంధర్ రెడ్డిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు ఆయనకు మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.ఎస్సై జలంధర్ రెడ్డి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతిభద్రతలను మరింత పటిష్టంగా అమలు చేస్తారని భరోసా ఇచ్చారు. అలాగే, గ్రామస్థాయి సమస్యల పరిష్కారంలో పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ సర్పంచ్ అభ్యర్థి వడ్డే శేఖర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రేమ్ సాగర్, మాజీ ఉపసర్పంచ్ మల్లికార్జున్, రవీందర్, గుండెల అంజనేయులు, మద్దూర్ నరసింహ, వినయ్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .