రఘునాధపాలెం ప్రజల చిరకాల స్వప్నం సాకారవేళ
*"నాడు పాలేరు- నేడు మంచుకొండ"*
*"రేపు సీతారామ తో జిల్లా జలకళ తుమ్మల లక్ష్యం"*
"*సామాజిక వేత్త లోడిగ.వెంకన్నయాదవ్"*
ఖమ్మం బ్యూరో, జనవరి 14(తెలంగాణ ముచ్చట్లు)
పాలేరు నుండి పర్ణశాల వరకు తుమ్మల చేసిన అభివృద్ధి ఉమ్మడి ఖమ్మం జిల్లా కు శ్రీరామరక్ష. దీనికి నిద్రర్శనం నాడు పాలేరు భక్త రామదాసు, నేడు పండితాపురం ఎత్తిపోతల పధకం రేపు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పదిలక్షల ఎకరాలకు సాగునీరు తర్వాత త్రాగు నీటికి శాశ్వత పరిష్కారం తుమ్మల లక్ష్యం. ఈ జిల్లాను జలకళ తో రైతాంగం మొహంలో చిరు నవ్వులతో ఆనందాన్ని చూడడం తుమ్మల ప్రదాన జీవిత కల. ఇది సాకారం కావడానికి ఎంతో దూరంలో లేదు అనే దానికి నిద్రర్శనం వారు ఈజిల్లాకోసం తపిస్తున్న తీరు చూసేవారికి ఆశ్చర్యం కలిగించక మానదు. ఏడుపదుల వయస్సులో నీటిని ఊరకలు వేయిస్తు పొలంలో కి వరదలు పరుగులు పెట్టిస్తున్న తీరు సీతారామ ప్రాజెక్ట్ పై రైతాంగంనకు నమ్మకం పెరింది. వ్యవసాయం ఆధారంగా రైతాంగం తో పాటు,వ్యవసాయ జీవనాధారంతో జీవిస్తున్న ప్రజలు మట్టివాసనను ముద్దగా మలుచుకొని బ్రతుకుతున్న ఎందరికో తుమ్మల అపరభగీరధుడుగా, అభివృద్ధి ప్రదాత గా నామకర్ణకు భరోసా కల్పించారు. ఇది ఒక్కరోజులో వచ్ఛింది కాదు.దానికి ఐదుశదాబ్ధాల నిరంతర రాజకీయ పోరాట పటిమ పనితీరు నిద్రర్శనం కరువు కాటకాలతో సాగటానికి బొక్కెనడు నీళ్ళు,త్రాగటానికి గుక్కెడు నీరు లేక అలమటిస్తున్న పాలేరు రైతాంగ ప్రజలు గోస వర్ణనాతీతంగా ఉండేది. ఎగువున తిరుమనాయపాలెం మండలం దిగువున కూసుమంచి మండలం చెంతనే పాలేరు చెరువు ఉన్నా చింతతప్పని రైతాంగం కొరకు తుమ్మల ఆపత్భాందవుడిలా పాలేరు వచ్ఛారు. పాలేరు ప్రజలకు ఒక ఆశ చిగురురించింది. దాని పరిష్కారమే భక్తరామదాసు ఎత్తిపోతల ద్వారా రూపకల్పన చేసి ,కూసుమంచి,తిరుమనాయపాలెం మండలం రైతుల మొహంలో చిరునవ్వులు చిందించిన ఘనత తుమ్మల నాగేశ్వరరావు గారిది అనేది నిజం. ఇది దేశంలోనే ఒక నూత ఒరవడిని సృష్టించిది అని చెప్పవచ్చు. వ్యవసాయ నీటిపారుదల రంగంలో ఒక మార్పు ను తీసుకువచ్ఛింది.. ఆలోచన వచ్చిందే తడువుగా ఆనాటి ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఒప్పించి భక్తరామదాసు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేసి తొమ్మిది నెలలోనే పూర్తి చేసిన ఘనత తుమ్మలది.దిగువన ఉన్ననీటిని ఎగువకు పంపించి తిరుమనాయపాలెం, కూసుమంచి మండలాలలో ఉన్న చెరువులను నింపించి పాలేరు ప్రజల చేత శభాష్ అనిపించు కొన్నారు తుమ్మల.
ఇప్పుడు అదే తరహాలో నీటి ఎద్ధడితో అలమటిస్తున్న ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం రైతాంగం చిరకాలస్వప్నం సాకారంచేయడాని సాగర్ జలాలద్వార మంచుకొండ ఎత్తిపోతల ప్రాజెక్ట్ తలపెట్టి రఘునాధపాలెం మండలం లో నీటిని పరుగులు పెట్టించిన ఘనత తుమ్మల ది. నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఒప్పించి (నూటాఒక్కకోట్లు) 101 కోట్లు మంజూరు చేపించి కేవలం పన్నిండు నెలల కాలంలో పనులు పూర్తి చేసి సాగరు జలాలను మండలంలోని 37 గ్రామంచాయతి పరిధిలోని 36 చెరువులు నింపే బృహత్తర కార్యక్రమం చేపట్టిన తుమ్మల ఖమ్మం ప్రజల చేత శభాష్ అనిపించు కొన్నారు. గత సంక్రాంతి కి శంకుస్థాపన చేసి వచ్చే సంక్రాంతికి పూర్తి చేసి మీ పొలాలకు నీటిని మళ్ళిస్తా అని 12 నెలలలోనే పూర్తి చేసి అన్న మాట నిలబెట్టుకొన్నారుతుమ్మల . దీని ద్వారా సుమారు 3000 ఎకరాల భూమి సాగులోకి రావడం కాకుండా అడుగంటి పోయిన భూగర్భజలాలు పైకి ఉబికి తద్వారా నీటి లభ్యత పరోక్షంగా ప్రత్యేక్షంగా సాగు త్రాగు నీరు పుష్కలంగా చుట్టుపక్కల గ్రామాలకు లభిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.ఇది తుమ్మల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుంది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ఒక్కటే తుమ్మల జీవిత లక్ష్యం గా ఎంచుకొని అంకుటిత దీక్షతో పనిచేసిస్తున్న నాయకులు తుమ్మల నాగేశ్వరరావు. కృష్ణ జలాలు ఏకారణం చేతనైనా ఖమ్మం జిల్లాకు రాకపోయినా, ఆలస్యం అయినా, ఋతుపవనాలు రాక సకాలంలో వర్షాలు పడకపోయినా ఖమ్మం జిల్లా రైతాంగం నీటి ఎద్ధడితో పంటపొలాలు దెబ్బతిని రైతులు నష్టపోకూడదు అన్నదే తుమ్మల అభిమతం. దానికి ఏకైక మార్గం గోదావరి జలాలను సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం మొహంలో చిరునవ్వులు చూడాలన్నదే తుమ్మల జీవిత లక్ష్యం.
దిగువనుండి ఎగువకు మోటార్ సిస్టంతో పైపులద్వార, కాలువ ద్వార రిజర్వాయర్ లు నింపి దాని ద్వారా చెరువు కుంటలు నింపి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేసి ఖమ్మం జిల్లా జలకళ తో కళకళలాడుతూ ఉండాలని నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారితో సీతారామ ప్రాజెక్ట్ కు నిధులు కేటాయించి పనులు వేగవంతం చేశారు. 80 శాతం పనులు పూర్తి చేసి ఈ పదవీ కాలం లోపే తన కలసాకారం చేసి గోదావరి జలాలతో ఖమ్మం జిల్లా రైతాంగం కాళ్ళు కడిగి తన జీవిత లక్ష్యం సాకారం చేసుకోవాలన్న కృతనిశ్చయంతో తుమ్మల పనిచేస్తున్నారు.ఈ లక్ష్య సాదనలో ప్రజలతో పాటు ఆ భద్రాచలం సీతారామచంద్రమూర్తి ఆశీస్సులు తనకు కావాలి అని తరచు బహిరంగ సభలో ప్రజలకోరుకొంటారు.వారి జీవిత ఆశయం తనకోసం కాదు,తన కుటుంబం కోసం కాదు తనన్ని నమ్మి ఐదు శతాబ్దాలుగా రాజకీయాలలో నిలబెట్టి ఆశీర్వదించిన ప్రజలకు ఏదోఒకటి చెయ్యాలి అన్నతపన. తన తపన నాడు పాలేరు భక్త రామదాసు ప్రాజెక్ట్ అయినా నేడు పండితాపురం ఎత్తిపోతల ప్రాజెక్ట్ అయినా రేపు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా కు గోదావరి జలాలతో జలకళ సంతరించి ప్రతి చేనుకు నీరు ,ప్రతి చేతికి పని తో ప్రతీరైతు మొహంలో ఆనందం చూడాలన్న ఏకైక లక్ష్యం తుమ్మల ది వారి అంకుటిత దీక్ష జీవిత కల,ఖమ్మం జిల్లా జలకళ తో కళకళలాడలని త్వరలోనే నెరవేరాలని ఆశిద్ధాం....


Comments