సంక్రాంతి ముగ్గుల పోటీల్లో వెల్టూర్ గ్రామంలో మహిళల ప్రతిభకు ఘన సత్కారం
విజేతలకు ప్రోత్సాహ బహుమతులు అందజేత
పెద్దమందడి,జనవరి14(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు తమ సృజనాత్మకతతో రంగురంగుల ముగ్గులు వేసి గ్రామాన్ని పండుగ వాతావరణంతో నింపారు.ఈ పోటీల్లో మొదటి బహుమతి విజేతగా నిలిచిన బోయ అనితకు గ్రామ సర్పంచ్ దండు అశోక్ చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతి అందజేశారు. రెండవ బహుమతి విజేత కుమ్మరి లక్ష్మికి బీజేపీ మాజీ మండలాధ్యక్షుడు రమేష్ చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతిని అందజేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దండు అశోక్ విజేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మహిళల్లో ఉన్న కళా ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. గ్రామీణ సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవడంలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శాఖ వెంకటయ్య, మాజీ ఉప సర్పంచ్ నాగమణి నరేష్,రఘువర్ధన్ రెడ్డి, వివేకానంద,జి సతీష్, బుసయ్య , మహేష్ కోట కదరా సత్తా రెడ్డి, నాగన్న, అనంతరెడ్డి,గ్రామ పురుహితులు శ్రీనివాస్ శర్మ,శ్రీకాంత్ శర్మ.బాల శివుడు, శివానంద ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.


Comments