ఎస్ఆర్సి సంస్థ ఉద్యోగులకు బహుమతులు అందజేసిన  పరమేశ్వర్ రెడ్డి

ఎస్ఆర్సి సంస్థ ఉద్యోగులకు బహుమతులు అందజేసిన  పరమేశ్వర్ రెడ్డి

కాప్రా, జనవరి 14 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా కాప్రాలోని సైన్టిఫిక్ రీసెర్చ్ అండ్ కమ్యూనిటీ (ఎస్ఆర్సి) సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగులకు నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎస్ఆర్సి సంస్థ ఉద్యోగుల వినోదం, మానసిక ఉల్లాసం కోసం క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, రంగోళీ (ముగ్గుల పోటీలు) వంటి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, వాటిలో ప్రతిభ చూపిన విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా మందుముల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగుల్లో ఉత్సాహం, స్నేహభావం పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. చిన్న వయసులోనే పారిశ్రామికవేత్తగా ఎదిగి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, రాజకీయ నాయకునిగా సామాజిక సేవల్లో చురుకుగా పాల్గొంటున్న ఎస్ఆర్సి సంస్థ యజమాని తన్నీరు శ్రీహరి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. వారి సేవలు మరింతగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ, ఎస్ఆర్సి సంస్థ ఉద్యోగులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఆర్సి సంస్థ యజమాని తన్నీరు శ్రీహరి, మేనేజర్ శ్రీ రాము పాల్గొన్నారు.అలాగే కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్, కాప్రా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొబ్బనూరి నాగశేషు, మేడ్చల్ జిల్లా ఏఎంసీ డైరెక్టర్ పూర్ణ యాదవ్, మాజీ డైరెక్టర్ కొబ్బనూరి నాగరాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం యాదగిరి, టిల్లు యాదవ్, మల్లికార్జున్, కేఎల్ రావు, పడమటి మల్లారెడ్డి, పొట్టు బాబురావ్, నరేందర్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, ఉప్పల వినోద్, రాకేష్ యాదవ్, జగదీష్, తోటకూర శ్రీకాంత్, మూర్తుజా, నాగరాజు యాదవ్, సతీష్ యాదవ్, సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.IMG-20260114-WA0078

Tags:

Post Your Comments

Comments

Latest News

విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన
నాచారం, జనవరి 14 (తెలంగాణ ముచ్చట్లు): యువత ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా రూపుమాపేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాచారం...
తెలంగాణ ముచ్చట్లు క్యాలెండర్ ఆవిష్కరణ.
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 
ఖండాంతారాల్లో సిపిఐ వందేళ్ల పండుగ
ముఖ్యమంత్రి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
రఘునాధపాలెం ప్రజల చిరకాల స్వప్నం సాకారవేళ
17 న సాయుధ పోరాట అమరుల సంస్మరణ సభ