అమ్మవారిపేట జాతర ఏర్పాట్లను సమీక్షించిన డిసిపి దార కవిత

అమ్మవారిపేట జాతర ఏర్పాట్లను సమీక్షించిన డిసిపి దార కవిత
జాతర పనులను పరిశీలిస్తున్న డిసిపి కవిత

కాజీపేట్ జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు)

కాజీపేట్ మండలం మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అమ్మవారిపేట గ్రామం నందు ఈ నెల 28 నుండి 31 వరకు జరగనున్న శ్రీ మేడారం జాతరకు సంబంధించిన బందోబస్త్ తోపాటు రక్షణ తదితర అంశాల గురించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత  స్వయంగా పరిశీలించారు. అంతేగాకుండా జాతర యొక్క 4 రోజులలో ఏ రోజు ఏమి జరుగుతుంది ఎంత జనాభా వస్తారు, యాత్రికులకు ఏలాంటి సౌకార్యలు ఏర్పాట్లు గతంలో ఏవైనా అనుకోని సంఘటనలు జరిగాయా జాతర కార్యవర్గం సభ్యులు ఎవరెవరు ఏమి పని చేస్తున్నారని వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా సెంట్రల్ జోన్ డిసిపిదార కవిత మాట్లాడుతూ అమ్మవారిపేట గ్రామం లోస్వయంభువు గా వెలిసిన సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడం ఆనందంగా ఉంది. ఈసారి జాతరకు పటిష్టమైనబందోబస్త్ ఏర్పాటు చేస్తున్నాము. భక్తులకు ఎటువంటి ఆపదలు లేకుండా క్షేమంగా అమ్మవార్లను దర్శించుకునే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేసి జాతర ప్రశాంతంగా జరిగేలా చూస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో  కాజిపేట్ ఏసిపి ప్రశాంత్ రెడ్డి , మడికొండ ఇన్స్పెక్టర్ శ్రీ పుల్యాల కిషన్ ,  సిబ్బంది స్థానిక కార్పొరేటర్ జలగం అనిత రంజిత్ ఆలయ చైర్మన్ కోడూరి భిక్షపతి పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కూకట్పల్లిలో సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన కూకట్పల్లిలో సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన
  కూకట్పల్లి, జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి
ఎల్కతుర్తిలో ‘తెలంగాణ ముచ్చట్లు’ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
మల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
రేవంతన్న సర్కార్ గృహజ్యోతి పథకంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు
స్వామి వివేకానంద జయంతి విగ్రహానికి పూల మాల వేసిన
సంక్రాంతి ముగ్గుల పోటీలకు మంచి స్పందన
రోడ్డు ప్రమాదంలో గాయపడిన విలేఖరి రాంబాబును పరామర్శించిన.!