ఖిల్లా గణపురం లో ఘనంగా వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు

ఖిల్లా గణపురం లో ఘనంగా వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు

ఖిల్లా గణపురం (తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో వడ్డే ఓబన్న 219వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మండల అధ్యక్షులు ఓర్సు యాదయ్య, మండల ప్రధాన కార్యదర్శి వల్లెపు ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు దాసర్ల భూమయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.భూమయ్య తెలిపారు, వడ్డే ఓబన్న జనవరి 11, 1807న రేనాటి ప్రాంతంలో జన్మించి, సంచార జాతి వడ్డెర కులానికి చెందిన నాయకుడు. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో రేనాటి పాలెగాళ్లకు కుంఫనీ తవర్జీ విషయంలో ప్రారంభమైన ఘర్షణలు, క్రమేపీ సాయుధ పోరాటాలుగా మారినట్లు వివరించారు. నొస్సం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సాయుధ పోరులో వడ్డే ఓబన్న సైన్యాధ్యక్షుడిగా పోషించిన వీరోచిత పాత్ర చరిత్రలో నిలిచిపోయిందని, సైన్యాన్ని సమర్ధవంతంగా నడిపి కుంఫనీ సైన్యాన్ని ఊచకోత కోసి ఊరేసిన తీరు గర్వప్రదంగా ఉందని ఆయన గుర్తుచేశారు.వడ్డెర్ జాతి మాత్రమే కాదు, సభ్య సమాజం మొత్తం గర్వించదగ్గ వీరత్వాన్ని వడ్డే ఓబన్న చాటినట్టు భూమయ్య వివరించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నాయకులు సామ్య నాయక్, మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ క్యామ రాజు, బిజెపి నాయకులు బుచ్చిబాబు గౌడ్, ఆశన్న వాడు, మెంబర్ లింగస్వామి, వడ్డెర సంఘం నాయకులు శ్రీరాములు, బీచుపల్లి ఆంజనేయులు, మల్లేష్ కురుమూర్తి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం
జాతీయస్థాయి సీనియర్ కోకో పోటీలను ప్రారంభిస్తున్న మంత్రులు అనంతరం మాట్లాడుతున్న ఉత్తంకుమార్ రెడ్డి ముఖ్య అతిధులు గా హాజరైన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,...
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
మృతుని కుటుంబానికి మేఘన్న ఆర్థిక చేయూత
షైన్ హై స్కూల్ సంక్రాంతి సంబరాలు...
సంక్రాంతి సందర్భంగా  ముగ్గుల పోటీలు
కందుకూరులో మంత్రి తుమ్మల పర్యటన.!
ముమ్మర ప్రచారం భారీ ఏర్పాట్లు