వెల్టూర్ లో వారాంతపు కూరగాయల సంతకు శ్రీకారం చుట్టిన సర్పంచ్ అశోక్ 

వెల్టూర్ లో వారాంతపు కూరగాయల సంతకు శ్రీకారం చుట్టిన సర్పంచ్ అశోక్ 

పెద్దమందడి,జనవరి11(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ అశోక్ ఆధ్వర్యంలో గ్రామస్తులు సమావేశమై వారాంతపు కూరగాయల సంత ఏర్పాటు అంశంపై చర్చించారు. చాలాకాలంగా గ్రామంలో కూరగాయల సంత ఏర్పాటు చేయాలనే అభిప్రాయం ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల అది అమలుకు నోచుకోలేదని గ్రామస్తులు ఈ సందర్భంగా తెలిపారు.నూతన గ్రామ సర్పంచ్ అశోక్ గ్రామ ప్రజలతో విస్తృతంగా చర్చించి, కూరగాయల సంత ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గ్రామస్తుల అభిప్రాయం మేరకు వారాంతపు కూరగాయల సంతను ప్రతి ఆదివారం నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ.. కూరగాయల సంత ఏర్పాటు కోసం ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్న స్థలాన్ని శుభ్రం చేసి సంతకు అనుకూలంగా అభివృద్ధి చేస్తామని, అలాగే సంత నిర్వహణకు అవసరమైన సదుపాయాలు, మౌలిక వసతులను త్వరలోనే సమకూరుస్తామని తెలిపారు.ఈ సంత ద్వారా రైతులకు తమ పంటను నేరుగా విక్రయించే అవకాశం లభిస్తుందని, గ్రామస్తులకు నాణ్యమైన కూరగాయలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ బాలచంద్రయ్య, మాజీ వైస్ ఎంపీపీ సాక వెంకటయ్య, మాజీ ఉపసర్పంచ్ లు నాగమణి నరేష్, మల్లికార్జున్, రిటైర్డ్ సిఐ బాల్ రెడ్డి,  పెద్దమందడి మండలం బిజెపి మాజీ అధ్యక్షుడు రమేష్,రమేష్ గౌడ్, దండు నరేష్, డీలర్ విజయ్ కుమార్, మల్లక్ సురేష్ కుమార్, బుషయ్య, కమ్మరి శ్రీను, శాంతయ్య, జగతి రెడ్డి, అడివన్న ,చిత్తూరు కృష్ణారెడ్డి, భాస్కర్ గౌడ్, నాగరాజు గౌడు, రంజిత్ గౌడ్, నవీన్, ఆలయ పూజారి శ్రీకాంత్, బాల్ రెడ్డి, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం కాజీపేట్ లో అట్టహాసంగా 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం
జాతీయస్థాయి సీనియర్ కోకో పోటీలను ప్రారంభిస్తున్న మంత్రులు అనంతరం మాట్లాడుతున్న ఉత్తంకుమార్ రెడ్డి ముఖ్య అతిధులు గా హాజరైన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,...
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
మృతుని కుటుంబానికి మేఘన్న ఆర్థిక చేయూత
షైన్ హై స్కూల్ సంక్రాంతి సంబరాలు...
సంక్రాంతి సందర్భంగా  ముగ్గుల పోటీలు
కందుకూరులో మంత్రి తుమ్మల పర్యటన.!
ముమ్మర ప్రచారం భారీ ఏర్పాట్లు