రఘు నాథపాలెం మండలం వర ప్రదాయిని మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్
....*దశాబ్దాల సాగునీటి కల సాకారం చేయనున్న మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్*
....*లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసిన మంత్రి తుమ్మల*
...*..66 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్*
.....*సీఎం రేవంత్....మంత్రి తుమ్మల పై హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం*
ఖమ్మం బ్యూరో, జనవరి 11(తెలంగాణ ముచ్చట్లు)
సారవంతమైన భూములు రెక్కల కష్టం చేసే రైతులు కానీ సాగునీరు కలగా మారింది దశాబ్దాల సాగు నీటి కలను సాకారం చేసి రైతాంగం తలరాత మార్చాలని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేశారు మంత్రి తుమ్మల, గిరిజనుల భూములను సస్య శ్యామలం చేసేలా రఘునాథపాలెం మండలం వర ప్రధాయనిగా మారింది మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్
..రఘునాథ పాలెం మండలం.ఖమ్మం నియోజక వర్గంలో ఉన్న ఈ మండలం ఖమ్మం నగరానికి కూత వేటు దూరంలో ఉంది.అక్కడ భూములు సారవంత మైనవే కాదు ఖరీదైన భూములు.ఎకరం యాభై లక్షల నుంచి కోటి దాకా ధరలు ఉన్నాయి.సాగు నీటి వసతి లేక పోయినా రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల ఉద్యాన పంటలకు బాగా అనువైన భూములు కావడంతో ఖరీదు ఎక్కువ.గిరిజనులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో సాగు నీటి కష్టాలు. దశాబ్దాలుగా సాగు నీటి కోసం ఎదురు చూపులు.ఇలాంటి తరుణంలో ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన తుమ్మల ఎన్నికల ప్రచారంలో సాగు నీటి కలను సాకారం చేసేలా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెస్తానని తుమ్మల వాగ్దానం చేశారు.రేవంత్ సర్కార్ కొలువు తీరడంతో ఇచ్చిన మాట నిలుపుకున్నారు మంత్రి తుమ్మల.
..... *మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రూపకల్పన ఇలా*
రఘునాథ పాలెం మండలం భూములకు పక్కనే సాగర్ కెనాల్ ఉన్నా మరోపక్క మున్నేరు ఉన్నా సాగు నీటి వసతికి అనేక ఆటంకాలు. భౌగోళికం గా భూములు కాలువ ఏరు కంటే ఎత్తుగా ఉండటంతో సాగు నీరు అందని దుస్థితి.ఖమ్మం నియోజక వర్గ ఎమ్మెల్యే గా తుమ్మల ఎన్నికవ్వడం మంత్రి వర్గంలో ఉండడంతో తన సొంత నియోజక వర్గంలో రైతాంగం సాగు నీటి కలను సాకారం చేయాలని పట్టుదలతో తుమ్మల స్వయంగా రూపకల్పన చేసారు మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు నాగార్జున సాగర్ మేజర్ కెనాల్ పై వెంకటాయపాలెం డీఫ్ కట్ వద్ద పంప్ హౌస్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి సాగు నీళ్ళను లిఫ్ట్ చేయడానికి రూపకల్పన చేసారు. పంప్ హౌస్ వద్ద లిఫ్ట్ చేసిన నీళ్లు పైప్ లైన్ ద్వారా మంచుకొండ దేవర బోడు గుట్ట పై నిర్మాణం చేసిన డెలివరీ సిస్టర్న్ కు చేరుతాయి. సాగర్ కెనాల్ నుంచి 38 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తే పైప్ లైన్ ద్వారా 9 కిలో మీటర్లు దూరంలో ఉన్న డెలివరీ సిస్టర్న్ కు చేరతాయి అక్కడ నుంచి 36 చెరువులకు నీరు పైప్ లైన్లు ద్వారా చేరుతాయి.ఆరు సెగ్మెంట్ లుగా చెరువులను విడతల వారీగా నింపుతారు.మొత్తం పైప్ లైన్లు 35 కిలో మీటర్లు నిడివితో ఉన్నాయి.డెలివరీ సిస్టర్న్ నుంచి చెరువులకు గ్రావిటీ తో నీళ్ళు చేరతాయి.
....*లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు నిరంతరం పరిశీలన చేస్తున్న మంత్రి తుమ్మల*
.....మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను మంత్రి తుమ్మల నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.పంప్ హౌస్ పనులు పైప్ లైన్ పనులు క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి పలుమార్లు పరిశీలన చేసారు.
...*పెరగనున్న భూగర్భ జలాలు....మత్స సంపద.. జీవ వైవిధ్యం*
మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల రఘునాథ పాలెం మండలం సస్య శ్యామలం అవ్వడం తో పాటు, చెరువుల్లో సమృద్ధిగా నీరు నిలవ ఉంటే చుట్టు పక్కల భూగర్భ జలాలు పెరుగుతాయి.దాంతో బోరు బావులుతో సాగు చేసే రైతాంగం కు కష్టాలు తీరినట్లే. చెరువుల్లో నీరు నిండుగా ఉంటే చేపలు పెరగడం తో మత్స్య కారులకు ఉపాధి కలుగుతుంది.చెరువుల్లో నీరు నిండుగా ఉండటం వల్ల కుల వృత్తులు వారికి ఉపాది అవకాశాలతో పాటు జీవ వైవిధ్యం తో పల్లెలు పచ్చగా మారతాయి.మంచు కొండలిఫ్ట్ ఇరిగేషన్ ఆయకట్టు కింద ఎక్కువగా గిరిజనులు ఉన్నారు.
దశాబ్దాల సాగు నీటి కలను సాకారం చేస్తూ మంత్రి తుమ్మల సీఎం రేవంత్ అపర భగీరథులు గా నిలిచారని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..


Comments