సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న నెమలి అనిల్ కుమార్
గెలుపొందిన మహిళలకు నగదు బహుమతుల ప్రదానం
మల్లాపూర్, జనవరి 11 (తెలంగాణ ముచ్చట్లు):
సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మల్లాపూర్ డివిజన్ నాగలక్ష్మి నగర్ కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో గెలుపొందిన ఆడపడుచులకు నగదు బహుమతులు అందజేయడంతో పాటు, పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అనంతరం మహిళలకు, కాలనీ వాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని నెమలి అనిల్ కుమార్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సలహాదారులు పి.జి. సుదర్శన్, హమాలీ శ్రీనివాస్, సిహెచ్. మల్లేష్, ఎం. రంగా రెడ్డి, ఎం. సాయి కృష్ణ పాల్గొన్నారు. అలాగే కాలనీ అధ్యక్షులు తోట నవీన్ గౌడ్, ఉపాధ్యక్షులు ఎం. మాధవ్ రెడ్డి, వి. శివకుమార్, ప్రధాన కార్యదర్శి సి. కిశోర్, సంయుక్త కార్యదర్శి డి. శ్రీనివాస్ రెడ్డి, ఏ. శ్రీధర్ బాబు, కోశాధికారి ఎస్. నరేందర్ రెడ్డి, కె. అరుణ్‌తో పాటు స్థానిక మహిళలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



Comments