సాకేత్ కాలనీలో చారిత్రాత్మక న్యాయ తీర్పు

ఎస్‌ఆర్‌డబ్ల్యూఏ కార్యదర్శి పదవిలో సురేష్ చంద్ర నటరాజన్ పునరుద్ధరణ

సాకేత్ కాలనీలో చారిత్రాత్మక న్యాయ తీర్పు

కాప్రా, జనవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):

కాప్రా మున్సిపాలిటీ పరిధిలో, జీహెచ్‌ఎంసీ హద్దుల్లోని సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్న సాకేత్ కాలనీ మరోసారి చరిత్ర సృష్టించింది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి, అత్యధిక ఆదాయం కలిగిన కాలనిగా పేరొందిన సాకేత్‌లో కీలక న్యాయ తీర్పు వెలువడింది.మెడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కుషాయిగూడలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కమ్ ఫ్యామిలీ కోర్టు, నవంబర్ 11, 2025న ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు ప్రస్తుతం సాకేత్ కాలనీలో చర్చనీయాంశంగా మారింది.సాకేత్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎస్‌ఆర్‌డబ్ల్యూఏ) తరఫున, తెలంగాణ రాష్ట్ర సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం–2001 (చట్ట సంఖ్య 35/2001) ప్రకారం నమోదు అయిన సంఘం దాఖలు చేసిన ఎస్‌ఓపీ నం.04/2023లోని la No.609 పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. సీపీసీ ఆర్డర్ 39 రూల్ 1 & 2తో పాటు సెక్షన్ 151 కింద ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు కీలక తీర్పును వెల్లడించింది.పిటిషనర్ అసోసియేషన్ సమర్పించిన అఫిడవిట్‌ మరియు వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, ఎస్‌ఆర్‌డబ్ల్యూఏ కార్యదర్శిగా సురేష్ చంద్ర నటరాజన్ పదవిని పునరుద్ధరిస్తూ, ఆయన హోదాను కొనసాగించాలని ఆదేశించింది. అయితే, పిటిషన్‌లో కోరిన మిగతా ప్రార్థనలను కోర్టు తిరస్కరించింది.ఈ తీర్పుతో సాకేత్ కాలనీలో న్యాయపరమైన స్పష్టత ఏర్పడిందని, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యకలాపాలకు ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


IMG-20260110-WA0052

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏకశిలా నగర్ భూవివాదంపై ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు ఏకశిలా నగర్ భూవివాదంపై ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు
ల్యాండ్ మాఫియా–అధికారుల కుమ్మక్కు తక్షణమే ఆపాలి 24 గంటల్లో అరెస్టులు లేకపోతే ఉద్యమం ఉధృతం మేడ్చల్–మల్కాజ్గిరి , జనవరి 11 (తెలంగాణ ముచ్చట్లు)  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా...
రఘు నాథపాలెం మండలం వర ప్రదాయిని  మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్
జర్న‌లిస్టుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది
కొండా గోపి పుట్టినరోజు సందర్భంగా నాగులవంచలో రక్తదాన శిబిరం..
శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగులవంచలో ఘనంగా సంక్రాంతి సంబరాలు..
పాత్రికేయ విలువలకు నిలువెత్తు ప్రతీక  టీ.కే. లక్ష్మణ రావు
మీ నమ్మకాన్ని వొమ్ము చేయడం లేదు