విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించాలి
మణిగిళ్ల సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్
పెద్దమందడి,జనవరి9(తెలంగాణ ముచ్చట్లు):
విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందిస్తూ ముందుకు సాగాలని పెద్దమందడి మండలం మణిగిళ్ల గ్రామ నూతన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మణిగిళ్ల గ్రామ హైస్కూల్ మరియు ప్రైమరీ స్కూల్‌లలో నిర్వహించిన ముగ్గుల పోటీలు, ఫుడ్ ఫెస్టివల్, పతంగుల కాంపిటీషన్ల కార్యక్రమానికి ఆయన హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గెలుపు–ఓటములు సహజమని, ఓటమిని నిరాశగా కాకుండా అనుభవంగా తీసుకొని మరింత మెరుగ్గా రాణించాలన్నారు.విద్యార్థులు మంచి క్రమశిక్షణతో పాటు తల్లిదండ్రులు, గురువులు చెప్పిన మాటను పాటిస్తూ శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని సూచించారు. చదువుతో పాటు ఇలాంటి పోటీల్లో పాల్గొనడం వల్ల ప్రతిభ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు.విద్యార్థులు చదువుపై దృష్టి సారిస్తే ఉజ్వల భవిష్యత్తు తప్పకుండా ఉంటుందని, వారి అభివృద్ధికి అవసరమైన ఎలాంటి సహాయ సహకారాలైనా గ్రామపంచాయతీ తరఫున అందిస్తామని సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మద్దిరాల నరసింహారెడ్డి, ఉపసర్పంచ్ గణేష్, ఎస్. రాములు, మద్దిరాల రామకృష్ణారెడ్డి, పోతుల రామిరెడ్డి, ప్రతాపరెడ్డి, గొంది రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.అలాగే హైస్కూల్ హెడ్మాస్టర్ అడ్డాకుల వెంకటేష్, ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం నస్రిమ్‌తో పాటు ఉపాధ్యాయులు జానయ్య, వీ. రాములు, ఎస్. రాములు, రఫీ, రాధిక, లావణ్య, ముప్పిరి మధుసూదన్, ముపిరి మన్యం, ముప్పూరికుర్మయ్య తదితరులు పాల్గొన్నారు. 


Comments