నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన మద్దిగట్ల సర్పంచ్ మేకల రాములు
పెద్దమందడి,జనవరి7(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలానికి నూతనంగా నియమితులైన ఎస్సై జలంధర్ రెడ్డిని మద్దిగట్ల గ్రామ సర్పంచ్ మేకల రాములు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ సహకారం ఎంతో అవసరమని సర్పంచ్ రాములు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యేందుకు పోలీస్–గ్రామ పాలన మధ్య సమన్వయం ఉండాలని కోరారు.దీనికి స్పందించిన ఎస్సై జలంధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల భద్రతే తమ ప్రథమ కర్తవ్యమని, గ్రామాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు గ్రామ ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ మేకల రాములు, ఉప సర్పంచ్ రవి సాగర్, వార్డు సభ్యులు పాలెం రవి, మీసాల బాలయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.


Comments