దొడ్ల డైరీ స్టేట్ ఇంచార్జ్‌పై తల్వార్‌తో దాడి

దొడ్ల డైరీ స్టేట్ ఇంచార్జ్‌పై తల్వార్‌తో దాడి

తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ – యశోదకు తరలింపు

కీసర, జనవరి 08 (తెలంగాణ ముచ్చట్లు):

దొడ్ల డైరీ పాల్ స్టేట్ ఇంచార్జ్‌పై బ్రాంచ్ ఇంచార్జ్ తల్వార్‌తో దాడి చేసిన ఘటన కీసరలో కలకలం రేపింది. ఈ ఘటనలో దొడ్ల డైరీ స్టేట్ ఇంచార్జ్ కొండపాక శ్రీనివాస్ (50) తీవ్రంగా గాయపడ్డారు.పోలీసుల కథనం ప్రకారం… కీసర గ్రామంలోని దొడ్ల పాల్ బ్రాంచ్ ఇంచార్జ్ కిరణ్ అలియాస్ పవన్ కళ్యాణ్ సకాలంలో కంపెనీకి చెల్లించవలసిన డబ్బులు చెల్లించకపోవడంతో, దొడ్ల డైరీ యాజమాన్యం ఫ్రాంచైజీని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది.ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో స్టేట్ ఇంచార్జ్ కొండపాక శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి కీసరలోని దొడ్ల పాల్ బ్రాంచ్‌కు చేరుకున్నారు. ఈ సమయం లో కిరణ్ అలియాస్ పవన్ కళ్యాణ్ వారితో వాగ్వాదానికి దిగుతూ, ముందుగా తన వాహనంలో తెచ్చుకున్న తల్వార్‌ను తీసుకుని విచక్షణారహితంగా శ్రీనివాస్‌పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను వెంటనే చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడు కిరణ్ అలియాస్ పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ
ఖమ్మం బ్యూరో, జనవరి 8(తెలంగాణ ముచ్చట్లు) బీఆర్ఎస్ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం నాడు జిల్లాలో పర్యటించారు....
యాగంటి శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ ఎంపీ నామ దిగ్భ్రాంతి
పొంగులేటి ఇంట ఆత్మీయ ‘మాధురి’యం..!
ఖమ్మంలో సిపిఐ మోటార్ సైకిల్ ర్యాలీ
రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం 
గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత 
వెల్టూర్‌ లో ఘనంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదిన వేడుకలు