విద్యుత్ వినియోగదారుల సేవలకే ప్రాధాన్యం.
సిజిఆర్ఎఫ్ చైర్మన్ వేణుగోపాల చారి.
సత్తుపల్లి, జనవరి 8 (తెలంగాణ ముచ్చట్లు):
విద్యుత్ వినియోగదారులకు సమస్యలులేని సేవలు అందించడమే విద్యుత్ శాఖ ప్రధాన లక్ష్యమని సిజిఆర్ఎఫ్–1 చైర్మన్ వేణుగోపాల చారి స్పష్టం చేశారు.
విద్యుత్ శాఖ ఏడిఈ ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో, డీఈఈ రాములు పర్యవేక్షణలో మండల పరిధిలోని గంగారం సబ్‌స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల సదస్సులో ఆయన మాట్లాడారు. సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో నిర్వహించిన వినియోగదారుల సదస్సుల్లో పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. కేబుల్ డ్యామేజీలు, కరెంటు పోల్స్ నుంచి గృహాలకు వెళ్లే విద్యుత్ వైర్ల మార్పులు, సర్వీస్ వైర్ షిఫ్టింగులు, పోల్స్ నుంచి ఇంటి కనెక్షన్ వరకు దూరం అధికంగా ఉండటంతో వేలాడుతున్న వైర్లు, వోల్టేజ్ అప్ అండ్ డౌన్ సమస్యలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందినట్లు చెప్పారు.
విద్యుత్ వినియోగదారుల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఈఈలు శరత్, హనుమంతరావు, అనిల్, అంకారావు, విద్యుత్ వినియోగదారులుతదితరులు పాల్గొన్నారు. 


Comments