నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులను ముదిరాజ్ యువకులు ఘన సన్మానం

నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులను ముదిరాజ్ యువకులు ఘన సన్మానం

పెద్దమందడి,డిసెంబర్28(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి గ్రామంలో ఇటీవల నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ముదిరాజ్ కులం తరపున విజయం సాధించిన ప్రజాప్రతినిధులను ముదిరాజ్ కుల సంఘం యువకులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి జంగం పద్మ శివ, 9వ వార్డు నుంచి వాకిటి రమేష్, 10వ వార్డు నుంచి గొడుగు జ్యోతి రాజశేఖర్, 11వ వార్డు నుంచి కొత్త స్వాతి రాములు వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. అలాగే గ్రామ సర్పంచ్‌గా సూర్య గంగమ్మ రవి, ఉపసర్పంచ్‌గా బోయిని ఉషన్న యాదవ్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ముదిరాజ్ కుల సంఘం యువకులు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఘన స్వాగతం పలుకుతూ, భవిష్యత్తులో ప్రజాసేవలో అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.వారి విజయంలో పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ కుల సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు.ప్రభుత్వపరంగా అందుబాటులో ఉన్న అన్ని సంక్షేమ పథకాలను కుల, మత, మన అనే భేదం లేకుండా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందజేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో యువ నాయకుడు అడ్వకేట్ నందిమల్ల త్రినాథ్ ముదిరాజ్, వాకిటి వేణుగోపాల్, మాజీ జెడ్పిటిసి నందిమల్ల వేణుగోపాలకృష్ణ, మాజీ ఉపసర్పంచ్ గొడుగు రామచంద్ర, వాకిటి నాగభూషణం, పద్మనాభం, వైభవ్ శీను, నందిమల్ల బాలరాజు (మాజీ వార్డు సభ్యులు), రిటైర్డ్ హెడ్మాస్టర్ నందిమల్ల కృష్ణయ్య, నందిమల్ల కురుమూర్తి, వాకిటి సత్యనారాయణ, వీరమని కృష్ణయ్య తదితర కుల పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ
ఖమ్మం బ్యూరో, జనవరి 8(తెలంగాణ ముచ్చట్లు) బీఆర్ఎస్ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం నాడు జిల్లాలో పర్యటించారు....
యాగంటి శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ ఎంపీ నామ దిగ్భ్రాంతి
పొంగులేటి ఇంట ఆత్మీయ ‘మాధురి’యం..!
ఖమ్మంలో సిపిఐ మోటార్ సైకిల్ ర్యాలీ
రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం 
గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత 
వెల్టూర్‌ లో ఘనంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదిన వేడుకలు