కృష్ణారెడ్డి నగర్‌లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పర్యటన
స్థానిక సమస్యలపై అధికారులకు తక్షణ ఆదేశాలు
చర్లపల్లి, జనవరి (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ పరిధిలోని కృష్ణారెడ్డి నగర్ ప్రాంతంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రాంతంలో నెలకొన్న రోడ్ల దుస్థితి, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సరఫరా లోపాలు, వీధి దీపాల నిర్వహణ వంటి మౌలిక వసతులపై అధికారులను ప్రశ్నించారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించేలా తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.ప్రజల అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కారాలు అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలభాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక కాలనీ వాసులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments