మల్లాపూర్ డివిజన్ లో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి నెమలి అనిల్ కుమార్
మల్లాపూర్, జనవరి 08 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ పరిధిలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.“బస్తీ బాట” కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ విద్యుత్ శాఖ ఏఈ విజయతో కలిసి ఆయన పలు బస్తీలు, కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న విద్యుత్ సరఫరా లోపాలు, తక్కువ వోల్టేజ్ సమస్యలు, తరచూ జరుగుతున్న విద్యుత్ అంతరాయాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్న నెమలి అనిల్ కుమార్, అవసరమైన మరమ్మత్తులు చేపట్టి నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు, సమస్యలను త్వరలోనే పరిష్కరించి పనులను అతిత్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలోవిద్యుత్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.


Comments