ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సందర్శించిన రజిత పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్, జనవరి 07 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ డివిజన్ పరిధిలోని వి.టి.రోడ్, స్వరూప్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి సందర్శించారు.బుధవారం యశోద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎం.ఎం ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి రజిత పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే పరమావధిగా, సమాజ హితాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ఉచిత మెగా వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ శిబిరం నిర్వహించిన తేజస్విని పోలీ క్లినిక్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు.ఈ వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులచే సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్త పరీక్షలు, రక్తపోటు (బీపీ), కీళ్ల నొప్పులు, థైరాయిడ్, షుగర్ పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచిత వైద్య సలహాలు మరియు మందులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైద్య శిబిరం నిర్వాహకులు జపాల శ్రీనివాస్ (మేనేజింగ్ డైరెక్టర్), డాక్టర్ తేజస్విని, డాక్టర్ వినీత్డాక్టర్ రవితేజ, డివిజన్ అధ్యక్షుడు బాకారం లక్ష్మణ్, సల్ల ప్రభాకర్ రెడ్డి, రంగుల శేఖర్, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments