వనపర్తిలో శ్రీనివాస థియేటర్‌ను ప్రారంభించిన జిల్లెల చిన్నారెడ్డి

వనపర్తిలో శ్రీనివాస థియేటర్‌ను ప్రారంభించిన జిల్లెల చిన్నారెడ్డి

వనపర్తి,జనవరి7(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీనివాస థియేటర్‌ను బుధవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఘనంగా ప్రారంభించారు. థియేటర్ యజమాని సుదర్శన్  ఆహ్వాన మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి థియేటర్‌ను ప్రేక్షకులకు అంకితం చేశారు.
ఈ సందర్భంగా జిల్లెల చిన్నారెడ్డి  మాట్లాడుతూ.. వనపర్తి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వినోద సదుపాయాలు అందుబాటులోకి రావడం ఆనందకరమని పేర్కొన్నారు. ఇలాంటి థియేటర్లు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
శ్రీనివాస థియేటర్‌ను అత్యాధునిక శబ్ద వ్యవస్థ, చిత్ర ప్రదర్శన సాంకేతికత, విశాలమైన సీటింగ్ ఏర్పాట్లతో సౌకర్యవంతంగా నిర్మించినట్లు యాజమాన్యం వెల్లడించింది. ప్రారంభోత్సవం అనంతరం తొలి సినిమా ప్రదర్శనకు ప్రేక్షకులు ఉత్సాహంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమాజాన్ని చైతన్యపరిచే, స్ఫూర్తిదాయకమైన చిత్రాలను ప్రదర్శించే దిశగా యాజమాన్యం కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్ధన్, జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడు రోహిత్, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, గోపాల్‌పేట మండలం మాజీ జిల్లా పరిషత్ సభ్యుడు రాజేశ్వర్ రెడ్డి, వనపర్తి మండలం రైతు విభాగం అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి, వనపర్తి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రాగి అక్షయ్, గోపాల్‌పేట మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జిల్లెల ప్రవీణ్ రెడ్డి, వనపర్తి మండల విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, పెద్దమందడి మండల విద్యార్థి సంఘం నాయకులు వెంకటేష్ సాగర్‌తో పాటు సీనియర్ నాయకులు జానంపేట నాగరాజు, కోళ్ల వెంకటేష్, వాకిటి బాల్ రాజు, కృపాకర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, బాలరాజు, ఎంట్ల రవి, వెంకటేష్, పాండు రావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ
ఖమ్మం బ్యూరో, జనవరి 8(తెలంగాణ ముచ్చట్లు) బీఆర్ఎస్ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం నాడు జిల్లాలో పర్యటించారు....
యాగంటి శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ ఎంపీ నామ దిగ్భ్రాంతి
పొంగులేటి ఇంట ఆత్మీయ ‘మాధురి’యం..!
ఖమ్మంలో సిపిఐ మోటార్ సైకిల్ ర్యాలీ
రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం 
గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత 
వెల్టూర్‌ లో ఘనంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదిన వేడుకలు