తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
ఉప్పల్, డిసెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డిని శాలువాతో సత్కరించి, దీర్ఘాయుష్షు, ఆరోగ్యం మరియు ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల కాంగ్రెస్ ఇంచార్జి కోలన్ హనుమంత్ రెడ్డి, బండి రమేష్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి, భూపతి రెడ్డి, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.పార్టీ నాయకులు అందరూ కలిసి వేం నరేందర్ రెడ్డి ప్రజాసేవకు అంకితభావంతో కొనసాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.


Comments