ఉప్పల్ లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి
ఉప్పల్, డిసెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ డివిజన్ పరిధిలోని చేర్చి కాలనీలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చర్చ్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి మానవుడిలో ప్రేమ, క్షమాగుణాలు పెంపొందాలనే యేసుక్రీస్తు బోధనలు నిత్యం ఆచరణీయమని అన్నారు. ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందాన్ని నింపిన యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. విశ్వ మానవాళికి తన ప్రేమతత్వంతో వెలుగులు నింపిన కరుణామయుడు యేసుక్రీస్తు ప్రభువని అన్నారు.శాంతియుత సమాజ స్థాపన కోసం తన రక్తాన్ని చిందించిన ధీశాలి యేసుక్రీస్తు అని కొనియాడారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పర్వదినాన్ని ఉప్పల్ ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments