గర్భిణీలకు 102 అమ్మ ఒడి సేవలు.!

గర్భిణీలకు 102 అమ్మ ఒడి సేవలు.!

సత్తుపల్లి, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

కల్లూరు, పెనుబల్లి మండలాల్లోని గర్భిణీ స్త్రీలకు 102 అమ్మ ఒడి సేవల ద్వారా ఉచిత రవాణా సౌకర్యం అందిస్తున్నారు. నెలవారీ వైద్య పరీక్షల నిమిత్తం గర్భిణీ స్త్రీలను ఖమ్మం ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి 102 అమ్మ ఒడి వాహనం ద్వారా తరలించారు. కల్లూరు, పెనుబల్లి మండలాల్లోని గర్భిణీ స్త్రీలకు షెడ్యూల్ ప్రకారం ముందస్తు సమాచారం అందించి, 102 అమ్మ ఒడి వాహనంలో ఎక్కించుకొని సురక్షితంగా ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ఖమ్మం జిల్లా పరిధిలో 108 అంబులెన్స్, 102 (అమ్మ ఒడి), 1962 (పశు సంచార వాహనం), ఎఫ్ హెచ్ ఎస్ (పార్థివ వాహనం) సేవల జిల్లా మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్, మూడు జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ షేక్ నజీరుద్దీన్ పర్యవేక్షణలో ప్రతినెలా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అనంతరం తిరిగి ఇంటికి చేరే వరకు కల్లూరు, పెనుబల్లి మండలాల గర్భిణీ స్త్రీలకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రాల్లో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 102 అమ్మ ఒడి వాహనంలో గర్భిణీ స్త్రీలతో పాటు స్థానిక ఆశా వర్కర్ లేదా కుటుంబ సభ్యులు తోడుగా ఉంటారని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ సేవలను ప్రజలు, అధికారులు అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దశదిన కర్మకు హాజరు అయిన వడ్డెర సంఘం జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు దశదిన కర్మకు హాజరు అయిన వడ్డెర సంఘం జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 27(తెలంగాణ ముచ్చట్లు) ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామం గోగుల క్రీష్ణయ్య దశదిన కర్మకు హాజరు అయిన వడ్డెర సంఘం జిల్లా...
గ్రామ అభివృద్ధికి ముందడుగు..
బొల్లికొండ వెంకటేశ్వర్లుకు నివాళులు అర్పించిన జూపెడ సర్పంచ్ నరేందర్ రెడ్డి..
మున్సిపల్ సమస్యలపై బీజేపీ పోరాటానికి సిద్ధం.!
సాయిమల అయ్యప్పస్వామి దేవాలయంలో 18వ పడిపూజ 
సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ.!
మేడ్చల్ జిల్లా మున్నూరుకాపు సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం