బేతుపల్లిలో అరుదైన ఘనత… అమ్మను గౌరవించిన కూతురు.

తలకొరివితో మాతృభక్తి చాటిన పుల్లమ్మ.

బేతుపల్లిలో అరుదైన ఘనత… అమ్మను గౌరవించిన కూతురు.

సత్తుపల్లి, డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మండలం, బేతుపల్లి గ్రామంలో చీపి శేషమ్మ (80)  అనారోగ్యంతో మృతిచెందారు. అయితే ఆమెకు కుమారులు లేకపోవడంతో, నన్ను కని పెంచిన నా తల్లి… ఆమెకు నేనే తలకొరివి పెడతా అంటూ కూతురు గిరకటి పుల్లమ్మ ధైర్యంగా ముందుకు వచ్చి కర్మకాండను నిర్వహించారు. సాంప్రదాయంగా కుమారులే తలకొరివి పెట్టాలి అనుకునే వారి మధ్య, తల్లిపైన కూతురు చూపిన మాతృభక్తి గ్రామంలో చర్చనీయాంశమైంది. పుల్లమ్మ చేసిన ఈ నిర్ణయాన్ని గ్రామప్రజలంతా హర్షిస్తూ, ఆమెను అభినందించారు.

గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఇది సాంప్రదాయానికి కొత్త అర్ధం ఇచ్చే ఘటన… తల్లికి కూతురు చేసిన గౌరవం అందరికీ ఆదర్శం అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .