కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి.
మాజీ మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు.
హాసన్ పర్తి, డిసెంబర్ 11(తెలంగాణ ముచ్చట్లు):
రెండో విడుత సర్పంచ్ ఎన్నికలలో భాగంగా హాసన్ పర్తి మండలంలోని నాగారం,సుధానపల్లి,సీతంపేట, అనంతసాగర్, మడిపల్లి గ్రామంలో గురువారం రోజున మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా దయాకర్ రావు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దరాని కళ్ళబోలి మాటలు ఆరు గ్యారంటీలా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారలోకి వచ్చి రాష్ట్రానికి చేసింది ఎమిలేదని అన్నారు.కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థులకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి తోడ్పాడాలని సూచించారు.ఈ కార్యాక్రమంలో మండల అధ్యక్షుడు బండి రజని కుమార్,లలిత యాదవ్,ఇంచార్జ్ కుమార్ యాదవ్, ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు మొట్టే మానస అరుణ్, మేక రమ్య భగవాన్ రెడ్డి, అంబాలా ఉమా రమేష్,బుర్ర రంజిత్ కుమార్,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Comments