వెల్టూర్ గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ అభ్యర్థి అశోక్ (చిట్టి) చారిత్రాత్మక విజయం
బిఆర్ఎస్ అభ్యర్థి అశోక్ (చిట్టి) 564 భారీ మెజారిటీతో గెలుపు
పెద్దమందడి,డిసెంబర్12(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ సర్పంచ్‌గా బిఆర్ఎస్ అభ్యర్థి అశోక్ (చిట్టి) చారిత్రాత్మక విజయం సాధించారు. గ్రామ చరిత్రలో ఎన్నడూ రాని 564 ఓట్ల భారీ మెజారిటీతో ప్రత్యర్థులపై ఘన గెలుపు నమోదు చేస్తూ సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు.ఎన్నికల ప్రారంభం నుంచే గ్రామ ప్రజల మద్దతు అశోక్‌కు గట్టిగా లభించింది. గ్రామ అభివృద్ధి పట్ల చూపిన నిబద్ధత, ప్రజలతో నిశితంగా చేసిన మమేకం, ప్రతి ఇంటికి వెళ్లి చేసిన ప్రచారం ఈ విశేష విజయానికి కారణమైంది.ఎన్నిక ఫలితాలు వెలువడగానే వెల్టూర్ గ్రామం పండుగ వాతావరణం సంతరించుకుంది. అనుచరులు, గ్రామస్తులు డప్పులు మోగిస్తూ, పటాకులు పేలుస్తూ అశోక్‌ను ఘనంగా సన్మానించారు.గ్రామ చరిత్రలో ఇంత భారీ మెజారిటీతో వచ్చిన ఈ విజయం వెల్టూర్ అభివృద్ధికి నూతన దిశను చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ ప్రజల విశ్వాసానికి తగిన విధంగా సేవలు అందిస్తానని సర్పంచ్ అశోక్ సంకల్పం వ్యక్తం చేశారు.


Comments