నాచారం ఎరుకల బస్తీలో రోడ్డు సమస్యపై కార్పొరేటర్ కు వినతి పత్రం
రంజాన్ లోపే సిమెంట్ రోడ్డు వేస్తామని కార్పొరేటర్ హామీ
Views: 4
On
నాచారం, డిసెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
నాచారం ఎరుకల బస్తీలోని మసీదు రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో, వచ్చే రంజాన్ పండుగలోపల సిమెంట్ రోడ్డు వేయాలని జామియా మసీదు నూతన అధ్యక్షులు సయ్యద్ సయీద్ నాచారం డివిజన్ కార్పొరేటర్‌కు వినతి పత్రం అందజేశారు.ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తూ మసీదు రోడ్డులో సిమెంట్ రోడ్డు పనులు చేపడతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మహమ్మద్ జమీల్ అహ్మద్, సయ్యద్ తాహెర్, మహమ్మద్ ఫరూక్, మహమ్మద్ యూసుఫ్, షేక్ మహబూబ్, మహమ్మద్ కామిల్, సయ్యద్ లతీఫ్‌తో పాటు బిఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
13 Dec 2025 21:23:59
పెద్దమందడి,డిసెంబర్13(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...


Comments