చిల్కానగర్ డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి

జోనల్ కమిషనర్‌ను కలిసిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్

చిల్కానగర్ డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి

చిల్కానగర్, డిసెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు)

చిల్కానగర్ డివిజన్ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ఆయన జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా చిల్కానగర్ డివిజన్లోని పలు కాలనీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు.ముఖ్యంగా శివాలయం వెనుక ఇమామ్ గల్లీలో స్ట్రాం వాటర్ డ్రైన్స్‌తో పాటు సీసీ రోడ్ల నిర్మాణం, చిల్కానగర్ మల్ల మైసమ్మ ఆలయం పక్క వీధిలోని సుభద్ర, సత్యవతి గల్లీల్లో అలాగే నాగదేవత ఎదురు ప్రాంతంలో సీసీ రోడ్ల నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ప్రశాంత్ నగర్ రోడ్ నెంబర్ 1, 2లో సీసీ రోడ్లు, కళ్యాణపురి మర్రిచెట్టు దగ్గర నుండి కళ్యాణపురి పార్క్ వరకు సీసీ రోడ్డు, బీరప్ప గడ్డ రామాలయం ప్రాంతం, లైబ్రరీ ఎదురు గల్లీ, లైబ్రరీ వెనుక అన్నపూర్ణ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు.అదేవిధంగా అజ్మత్ నగర్ కాలనీ, బీరప్ప గడ్డ లైబ్రరీ వెనుక ప్రాంతం, అంబేద్కర్ నగర్ బస్తీ, ఇందిరానగర్ బస్తీ, చిల్కానగర్ గుట్టపై నవోదయ కాలనీ, మల్లికార్జున్ నగర్‌లలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.దీనికి స్పందించిన జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ పై పేర్కొన్న అభివృద్ధి పనులకు వీలైనంత త్వరగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం
పెద్దమందడి,డిసెంబర్‌13(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...
మణిగిల్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను సన్మానించిన మాజీ మంత్రి
వీరాయిపల్లి సర్పంచ్ చిట్యాల వెంకటేష్‌కు ఎమ్మెల్యే ఘన సన్మానం
మణిగిల్ల సర్పంచ్ పీఠం బీఆర్ఎస్ కైవసం
నాచారం ఎరుకల బస్తీలో రోడ్డు సమస్యపై  కార్పొరేటర్ కు వినతి పత్రం 
డ్రోన్ ద్వారా బందోబస్త్ పర్యవేక్షణ
ఘనంగా తేజ ఒకేషనల్ & పారామెడికల్ కళాశాల వార్షికోత్సవం!