తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యత్వం పొందిన దిండు రవీందర్
దిండు రవీందర్‌కు అభినందనలు తెలిపిన వెల్టూర్ గ్రామస్తులు
పెద్దమందడి,డిసెంబర్13(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన న్యాయవాది దిండు రవీందర్ తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యత్వం పొందడం హర్షణీయమైన విషయం.న్యాయవాద వృత్తిలో తనదైన ప్రతిభ, క్రమశిక్షణ, నిబద్ధతతో ముందుకు సాగుతున్న దిండు రవీందర్ తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యత్వం పొందడం ద్వారా తన వృత్తి జీవితంలో మరో ముఖ్యమైన మైలురాయిని అధిగమించారు. ఈ సందర్భంగా వెల్టూర్ గ్రామ ప్రజలు, న్యాయవాదులు, సన్నిహితులు, మిత్రులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి చట్టపరమైన సహాయం అందించాలనే సంకల్పంతో పని చేస్తున్న దిండు రవీందర్ సేవలు మరింత విస్తరించాలని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని పలువురు ఆకాంక్షించారు.తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యత్వం పొందడం ద్వారా ఆయన న్యాయ సేవలు మరింత ప్రభావవంతంగా కొనసాగుతాయని, యువ న్యాయవాదులకు ఆదర్శంగా నిలుస్తారని అభిప్రాయపడ్డారు.


Comments