గ్రామాభివృద్దే లక్ష్యంగా పనిచేయండి
–సిపిఐ జాతీయ నాయకులు వువ్వాడ నాగేశ్వరరావు
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 13(తెలంగాణ ముచ్చట్లు)
గ్రామాభివృద్దే లక్ష్యంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు పేర్కొన్నారు. చింతకాని మండలంలో నూతనంగా ఎన్నికైన సిపిఐ సర్పంచ్ లు శనివారం సిపిఐ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావును ఖమ్మం మమత మెడికల్ కళాశాలలో కలిసి ఆశీస్సులు పొందారు. చిన్నమండవ, నాగిలిగొండ, నేరడ, రాఘవావురం, బస్వాపురం సర్పంచ్లు పర్చా రామచంద్రరావు, ఏవూరి పద్మ, దూసరి నేతాజీ, కాంపల్లి కోటమ్మ, ఆవుల నర్సింహారావు లు పువ్వాడ ను శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వువ్వాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వనతుల కల్పించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా వని చేస్తే ప్రజలే తిరిగి మనల్ని గెలిపిస్తారని అభివృద్దే ఎజెండాగా పనిచేయాలని నూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కొండవర్తి గోవిందరావు, ఏపూరి రవీంద్రబాబు, పావులూరి మల్లిఖార్జునరావు, జిల్లా సమితి సభ్యులు దూసరి శ్రీరాములు, రాసాల మోహన్ రావు, మండల కార్యదర్శి దూసరి గోపాలరావు, సహాయ కార్యదర్శులు మార్గం శ్రీను, అబ్బూరి మహేష్ నాయకులు వదిమల వెంకటనర్సయ్య, కొల్లి రవి, బొడ్డు కొండలరావు, అమర్లపుడి వెంకన్న, దొబ్బల కోటేశ్వరరావు, తుపాకుల సైదులు, షేక్ దస్తగిరి, జి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


Comments