నెహ్రు నగర్, అశోక్ నగర్, మర్రిగూడ కాలనీలను శక్తి సాయి నగర్ డివిజన్‌లో కలపాలని డిమాండ్

నెహ్రు నగర్, అశోక్ నగర్, మర్రిగూడ కాలనీలను శక్తి సాయి నగర్ డివిజన్‌లో కలపాలని డిమాండ్

మల్లాపూర్, డిసెంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):

జిహెచ్ఎంసి నూతన డిలిమిటేషన్‌ లో మల్లాపూర్ డివిజన్ పరిధిలో ఉన్న నెహ్రు నగర్, అశోక్ నగర్, మర్రిగూడ, హెచ్‌సీఎల్ కాలనీలను మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్‌కు జత చేసిన నేపథ్యంలో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ కాలనీలను శక్తి సాయి నగర్ డివిజన్‌లోనే కలపాలని కోరుతూ కాప్రా సర్కిల్ జిహెచ్ఎంసి కార్యాలయం లో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి స్థానికులతో కలిసి అధికారులకు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ,“భౌగోళికంగా, ప్రజా సమస్యల పరంగా, శక్తి సాయి నగర్‌కు ఈ కాలనీలు సహజ అనుసంధానం కలిగి ఉన్నాయి. ప్రజలకు అసౌకర్యం కలగకుండా డివిజన్ మార్పు చేయాలి” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో నెహ్రూనగర్, అశోక్ నగర్, మర్రిగూడకు చెందిన పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .