షాహీ ఎక్స్‌పోర్ట్స్ కార్మికుల ధర్నా ఐదో రోజుకూ కొనసాగింపు
లేబర్ శాఖ జోక్యం ఫలించలేదు – చర్చలు నిలిచిపోయాయి
యాజమాన్యం హామీని తిరస్కరించిన కార్మికులు
హైదరాబాద్, డిసెంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ నాచారం పారిశ్రామిక ప్రాంతంలోని షాహీ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ కార్మికుల ధర్నా ఐదో రోజుకీ కొనసాగింది. న్యాయమైన జీతాలు, పనిస్థల వేధింపుల నిలుపు, కనీస సౌకర్యాల కల్పన వంటి డిమాండ్లతో కార్మికులు చేపట్టిన ఆందోళనకు లేబర్ శాఖ అధికారులు జోక్యం చేసుకున్నప్పటికీ చర్చలు ఫలించలేదు. యాజమాన్యం ఇచ్చిన రాతపూర్వక హామీని కార్మికులు తిరస్కరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అంజయ్య భవన్ ముందు ధర్నా.jpeg)

సీఐటీయూ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో అంజయ్య భవన్ (లేబర్ కార్యాలయం) ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. ధర్నా తీవ్రత పెరగడంతో జెసిల్ అధికారులు స్పందించి డీసీయల్ శ్యాంసుందర్ జాజు, ఏసీయల్ రవీందర్ రెడ్డిని చర్చల కోసం పంపారు. అయితే యాజమాన్యంతో జరిగిన మాట్లాడకలో స్పష్టత రాకపోవడంతో చర్చలు నిలిచిపోయినట్లు కార్మిక నాయకులు తెలిపారు.
నాయకుల మద్దతు
ధర్నా స్థలానికి సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి నారాయణ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్.రమ, రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీకాంత్, జిల్లా నాయకులు జె.చంద్రశేఖర్, ఏ.అశోక్, కోమటి రవి తదితరులు చేరుకున్నారు. కార్మికులకు ఐక్యత తెలుపుతూ వారు మాట్లాడుతూ—“కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. లేనిపక్షంలో పోరాటం మరింత తీవ్రమవుతుంది” అని హెచ్చరించారు.
యాజమాన్యం హామీపై అసంతృప్తి
లేబర్ అధికారులు కార్మికులకు యాజమాన్యం పంపిన రాతపూర్వక లేఖను వివరించారు. లేఖ ప్రకారం 7 రోజుల్లో సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని యాజ
మాన్యం హామీ ఇచ్చింది. అయితే ఇది స్పష్టతలేని హామీగా భావిస్తూ కార్మికులు తిరస్కరించారు.
కార్మికుల ఆవేదన
“మాకు న్యాయమైన జీతాలు కావాలి. మా శ్రమను దోచుకుంటున్నారు. సంస్థలో వేధింపులు పెరిగాయి. కనీస బాత్‌రూమ్ సౌకర్యాలు కూడా లేవు. స్పష్టమైన పరిష్కారం వచ్చినప్పుడే డ్యూటీలో చేరుతాం” అని కార్మికులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పి.గణేష్, ఐ.రాజశేఖర్, జి.శ్రీనివాస్, జె.వెంకన్న, బి.వి.సత్యనారాయణ, బి.లింగస్వామి, ఆర్.సంతోష్, ఐ.రమేష్, మహిళా నాయకులు వినోద, సృజన, మంగా, టీయూసీఐ ప్రదీప్, సీపీఐ నాయకులు బోస్, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Comments