అయ్యప్ప స్వామి మహా పడిపూజ

అయ్యప్ప స్వామి మహా పడిపూజ

చర్లపల్లి, డిసెంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):

చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని శ్రీరామ్ ఫుడ్స్ సంస్థలో బుధవారం అయ్యప్ప స్వామి మహా పడిపూజ భక్తిపూర్వకంగా, కన్నుల పండువగా నిర్వహించారు. ఈ వేడుకలను శ్రీరామ్ బేకరీ, స్వీట్స్ అధినేత కట్కూరి సుధా విజయకుమార్ రెడ్డి దంపతులు శ్రద్ధాభక్తులతో నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ ధర్మశాస్త్ర భజన మండలి నిర్వాహకులు ఎంఎల్ ప్రసాద్ ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తి గీతాలు ఆలపించగా, ప్రాంగణమంతా “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో మార్మోగింది.వేద పండితులు వీరేశం శర్మ ఆధ్వర్యంలో వైదికంగా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బండే గౌడ్, నాదం, విజయ్ కుమార్, కె. యాదిరెడ్డి, కట్కూరి బుచ్చిరెడ్డి, ముకుంద రెడ్డి, బద్ధం ప్రవీణ్ రెడ్డి, నీలా కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సాంబశివుడు, అరవింద్, కొండల్ రెడ్డి, నల్లోల్ల కనకయ్య, పణిరాజు, వెంకటేష్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి  రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి 
  కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)  కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే
ఉప్పల్ స్టేడియంలో మెస్సి మ్యాచ్ ఏర్పాట్లపై  డిజిపి సమీక్ష
కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి.
బలరాంనగర్ వద్దు.. నేరేడ్మెట్ డివిజన్‌ కావాలంటూ కాలనీ వాసుల డిమాండ్
రుద్ర బెల్లం టీ స్టాల్‌ను ప్రారంభించిన కార్పొరేటర్ బన్నాల 
నాచారంలో షాహి కంపెనీలో మహిళ కార్మికుల సమ్మె నాలుగో రోజు
బేతుపల్లిలో అరుదైన ఘనత… అమ్మను గౌరవించిన కూతురు.