అభివృద్ధిపై నమ్మకం ఉంచి.. వ్యక్తిత్వాన్ని గమనించి గెలిపించండి...
తల్లాడ మేజర్ పంచాయతీ అభ్యర్థి పెరిక నాగేశ్వరరావు (చిన్నబ్బాయి)..
ఖమ్మం బ్యూరో ,డిసెంబర్ 9(తెలంగాణ ముచ్చట్లు)
తల్లాడ: ఒక్కసారి అవకాశం ఇచ్చి సర్పంచ్ గా గెలిపిస్తే తల్లాడ మేజర్ పంచాయతీని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని టీడీపి, మద్దతు తెలిపిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పెరిక నాగేశ్వరరావు (చిన్నబ్బాయి) అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంగళవారం తల్లాడ,
ఎన్టీఆర్ కాలనీలో దాదాపు 150 మందికి పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి ప్రచారం చేశారు. తల్లాడ లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలు, డ్రైనేజీ, కోతులు, కుక్కలు బెడద వంటి సమస్యలు పరిష్కరించి తల్లాడ మేజర్ పంచాయతీకి గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. తల్లాడ మేజర్ పంచాయతీ రిజర్వేషన్ జనరల్ అయినా బీసీ వర్గానికి చెందిన తనకి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సహకారం, టీడీపీ, బలపరిచిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని అభివృద్ధి పై నమ్మకం ఉంచి, వ్యక్తిత్వాన్ని గమనించి తనని సర్పంచ్ గా గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. ప్రచారంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రెడ్డెం వీర మోహన్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరాజు, బీఆర్ఎస్ నాయకులు దగ్గుల శ్రీనివాసరెడ్డి, జి.వి.ఆర్, గుంటుపల్లి వెంకటయ్య, మాజీ ఉపసర్పంచ్ గుండ్ల వెంకటి కస్తూరి రాజు టిడిపి, బీఆర్ఎస్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments