అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు
మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్, డిసెంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు)
మహిళ, శిశు, వికలాంగుల & వయోవృద్ధుల సంక్షేమ శాఖ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం బుధవారం తిమ్మాయిపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ధైర్యం, పట్టుదలతో ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చునని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఇటీవల జిల్లా స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీలలో విజయం సాధించిన దివ్యాంగులకు బహుమతులు ప్రదానం చేశారు.అనంతరం మాట్లాడిన మహిళా, శిశు, దివ్యాంగుల & వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా సంక్షేమ అధికారిణి, డిఆర్డిఓ ప్రతినిధులు దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా సంక్షేమ అధికారి శారద, డిఆర్డిఓ అధికారి సాంబశివరావు, సీడీపీవోలు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దివ్యాంగుల అసోసియేషన్ ప్రతినిధులు, ఎన్జీఓలు తదితరులు పాల్గొన్నారు.


Comments