కాప్రా డివిజన్లో ఘనంగా సోనియాగాంధీ జన్మదినోత్సవ వేడుకలు

కాప్రా డివిజన్లో ఘనంగా సోనియాగాంధీ జన్మదినోత్సవ వేడుకలు

కాప్రా, డిసెంబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు)

కాప్రా డివిజన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొబ్బనూరి నాగశేషు ఆధ్వర్యంలో కాప్రా తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కొబ్బనూరి నాగశేషు మాట్లాడుతూ—సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా భారీగా వేడుకలు నిర్వహించామని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జి. విఠల్ నాయక్ మాట్లాడుతూ—భారతదేశ రాజకీయాల్లో సోనియా గాంధీ తిరుగులేని నాయకురాలని, ప్రజా సంక్షేమం కోసం ప్రధాని పదవిని త్యజించిన అరుదైన నాయకత్వం ఆమెదేనని అన్నారు. యూపీఏ అధ్యక్షురాలిగా దేశ రాజకీయాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ ప్రజల మనసు చదివి రాష్ట్ర హక్కులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న “సోనియా అమ్మ”కు తెలుగు ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారన్నారు.ఈకార్యక్రమంలో మేడ్చల్ జిల్లా యస్సి సెల్ అధ్యక్షులు పత్తి కుమార్, ఏఎంసి మాజీ డైరెక్టర్ కొబ్బనూరి నాగరాజు, సీనియర్ నాయకులు పడమటి మల్లారెడ్డి, ఓర్ల శ్రీధర్ రెడ్డి, నరేందర్ గౌడ్, రాకేష్ యాదవ్, తోటకూర శ్రీకాంత్, కే. రాజు, రిజ్వాన్ ఖాన్, సయ్యద్ మూర్తుజా, సంతోష్ చారి, నాగరాజు యాదవ్, జగదీశ్, షాబుద్దీన్, డివిజన్ వైసీసీ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఇమ్రాన్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి  రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి 
  కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)  కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే
ఉప్పల్ స్టేడియంలో మెస్సి మ్యాచ్ ఏర్పాట్లపై  డిజిపి సమీక్ష
కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి.
బలరాంనగర్ వద్దు.. నేరేడ్మెట్ డివిజన్‌ కావాలంటూ కాలనీ వాసుల డిమాండ్
రుద్ర బెల్లం టీ స్టాల్‌ను ప్రారంభించిన కార్పొరేటర్ బన్నాల 
నాచారంలో షాహి కంపెనీలో మహిళ కార్మికుల సమ్మె నాలుగో రోజు
బేతుపల్లిలో అరుదైన ఘనత… అమ్మను గౌరవించిన కూతురు.