గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసింది

బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి

గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసింది

-- మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

పెద్దమందడి,డిసెంబర్09( తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం  సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగత్ పల్లి, మనిగిల్ల, పెద్దమందడి, అల్వాల, అమ్మపల్లి, మోజర్ల, వెల్టూరు తదితర గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు సుఖేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, స్వాతి, రాజ మహేందర్ రెడ్డి, విట్ట విజయనిర్మల శ్రీనివాస్ రెడ్డి, కొత్త కాపు నరసింహరెడ్డి, దండు అశోక్ (చిట్టీ ) ల తరుపున విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... పెద్దమందడి రైతాంగాన్ని ఆదుకోవాలని బుద్దారం బ్రాంచ్ కెనాల్ ద్వారా సాగు నీరు అందించామని కానీ నీటి సరఫరా సకాలములో అందడం లేదని యాసంగి వచ్చే వరకు చెరువు ఎండిపోతుందని నిపుణుల ద్వారా అంచనా వేయించి శంకర సముద్రం నుండి ఎత్తిపోతల పథకం రూపొందించి రైతుల కష్టాలు తీర్చాలని భావించామని  కానీ అంతలోనే ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడం వల్ల సాధ్యం కాలేదని అయినా పెద్దమందడి సర్పంచుగా స్వాతి హరికుమార్ రెడ్డిని గెలిపిస్తే ఎత్తి పోతల పథకం సాధిస్తానని రైతాంగ వెతలు తీరుస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం మాయమాటలు చెబుతున్నారని నమ్మవద్దని మాకు ఓటు వేయకపోతే అభివృద్ధి ఆగిపోతుందని బెదిరిస్తున్నారని, రెండేండ్లు ఏమి పీకలేనివారు ఇప్పుడు ఏమి అభివృద్ధి చేస్తారని నిలదీయాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారా అభివృద్ధి జరుగుతుందని రేవంత్ రెడ్డి వల్ల ఏమి కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 420హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలకు శూన్యహస్తం చూపిందని ఎద్దేవ చేశారు. రైతులకు రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిందని, బోనస్ నేటికి 1154కోట్లు రైతులకు బకాయి పడ్డదని రైతు రుణ మాఫీకి దిక్కులేదని ఘాటుగా విమర్శించారు. కెసిఆర్ 46వేల చెరువులు దురాస్తు చేసి,10వేల కోట్లు కరెంటుకు కేటాయించి వ్యవసాయాన్ని పండుగలా చేసి 50లక్షల కోట్ల సంపద సృష్టించారని కొనియాడారు. రేవంత్ రెడ్డి వచ్చిన రెండేండ్లలో 2లక్షల 60వేల కోట్లు అప్పు చేసి ఏమి ఎలగబెట్టారని దుయ్యబట్టారు. ఇక్కడి నాయకులు సొంత మండలం అని చెప్పి 10ఏండ్లలో చేయని అభివృద్ధి 2ఏండ్లలో చేస్తామని ఒక్క తట్టమట్టి కూడా తీయలేదని అడ్డం పొడుగు మాట్లాడడం తప్పా చేసింది ఏమి లేదని హేళన చేశారు. నియోజకవర్గంలో జిల్లా కలెక్టరేట్ తేవడం ద్వారా పరిపాలన సౌలభ్యం జరిగిందని మాతా శిశు సంరక్షణ కేంద్రం ద్వారా వేలాది మంది పురుడుపోసుకొని రూపాయి ఖర్చు లేకుండా కెసిఆర్ కిట్టుతో సంతోషంగా ఇంటికి వెళ్ళేవారని నేడు వసతులు లేక ప్రైవేటు ఆసుపత్రులు ఆశ్రయించి నిలువు దోపిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసింది. గ్రామాలలో పచ్చదనం - పరిశుభ్రత కోసం కొత్తగా కార్మికులను నియమించి, కొత్త ట్రాక్టర్, ట్రాలీ ఏర్పాటు చేసి చెత్త సేకరించి పరిశుభ్రంగా ఉంచామని పచ్చదనం కోసం మొక్కలు నాటి పార్కులు ఏర్పాటు చేశామని, వైకుంఠ ధామాలు ఏర్పాటు చేశామని పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొన్నదని అన్నారు. కార్మికులకు జీతాలు లేక, ట్రాక్టరుకు డీజిల్ పోసే దిక్కు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదని ఘాటుగా విమర్శించారు. హామీలు అమలు చేయాలని గల్లా పట్టి నిలదీయండి. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను మహిళకు రూ.2500/-, ఆసరా పింఛన్లు రూ.4,000/-, తులం బంగారం, గ్యాస్ సబ్సిడీ, రైతులకు రైతు భరోసా, రైతు కూలీలకు రైతు భరోసా,ధాన్యానికి బోనస్, విద్యార్థినులకు స్కూటీలు, నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు, కెసిఆర్ కిట్టు, కంటివెలుగు పథకాలు ఏమైనాయని నిలదీయాలని పిలుపునిచ్చారు. వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని కెసిఆర్ సుపరిపాలన, గ్రామాల అభివృద్ధి జరగాలంటే బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమములో గట్టు యాదవ్, జగదీశ్వర్ రెడ్డి,పలుస రమేష్ గౌడ్, టీ.సేనా పతి, అల్వాల జగన్మోహన్ రెడ్డి, చిన్న వెంకటరెడ్డి, అమ్మపల్లి విట్టా శ్రీనివాస్ రెడ్డి, రామేశ్వర్ రెడ్డి, పెద్దమందడి జెడ్పిటిసి కే.రఘుపతి రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, చిత్తూరు కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డిIMG-20251209-WA0038 నందిమల్ల అశోక్, గంధం పరంజ్యోతి, బండారు కృష్ణ, ప్రేమ్ నాథ్ రెడ్డి, స్టార్ రహీమ్, గులాం ఖాదర్ ఖాన్, ఇమ్రాన్, అరీఫ్, మంద రాము, అనిపాటి రాము,అలీమ్, పంతుల శివ రెడ్డి, చిన్న బండలయ్య,నత్తి చంద్రయ్య వివిధ గ్రామాల బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి  రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి 
  కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)  కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే
ఉప్పల్ స్టేడియంలో మెస్సి మ్యాచ్ ఏర్పాట్లపై  డిజిపి సమీక్ష
కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి.
బలరాంనగర్ వద్దు.. నేరేడ్మెట్ డివిజన్‌ కావాలంటూ కాలనీ వాసుల డిమాండ్
రుద్ర బెల్లం టీ స్టాల్‌ను ప్రారంభించిన కార్పొరేటర్ బన్నాల 
నాచారంలో షాహి కంపెనీలో మహిళ కార్మికుల సమ్మె నాలుగో రోజు
బేతుపల్లిలో అరుదైన ఘనత… అమ్మను గౌరవించిన కూతురు.